iDreamPost
android-app
ios-app

సూర్య సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ డైరెక్టర్ కూతురు?

  • Author ajaykrishna Published - 02:08 PM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 02:08 PM, Mon - 21 August 23
సూర్య సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ డైరెక్టర్ కూతురు?

స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఓవైపు కంగువ అనే పాన్ ఇండియా మూవీ చేస్తూనే.. మరోవైపు నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ తీసిన డైరెక్టర్ సుధా కొంగరతో మరో సినిమా చేస్తున్నాడు. సూర్య – సుధా కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘సూరరై పొట్రు'(ఆకాశమే నీ హద్దురా).. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. కరోనా టైమ్ లో నేరుగా ఓటిటి రిలీజ్ అయ్యింది. ‘ఎయిర్ దక్కన్’ ఫౌండర్ గోపినాథ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. అనంతరం బెస్ట్ మూవీగా నేషనల్ అవార్డు సైతం కైవసం చేసుకుంది.

దీంతో ఇప్పుడు సూర్య – సుధా కాంబోలో సెకండ్ మూవీ వస్తుందని తెలిసి.. ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈసారి బిగ్ బడ్జెట్ తో సూర్య మూవీ ప్లాన్ చేస్తున్నట్లు గతంలో సుధా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ‘సూర్య43’ అని ప్రచారంలో ఉన్న ఈ సినిమా గురించి రోజురోజుకి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ సినిమాలో సూర్యతో పాటు మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించబోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది. కాగా.. ఇప్పుడు సూర్య43లో హీరోయిన్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. సూర్య43లో హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు.. అదితి శంకర్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ పేరు కోలీవుడ్ వర్గాలలో తెగ వైరల్ అవుతోంది. కాగా.. అదితి శంకర్.. ఇటీవలే శివకార్తికేయన్ సరసన ‘మహావీరుడు’ సినిమా చేసి.. సూపర్ హిట్ అందుకుంది. అంతకుముందు కార్తీ సరసన విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. సో.. చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యేసరికి అదితి పేరు ప్రెజెంట్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడు సూర్య సినిమాలో ఫైనల్ చేస్తారా లేదా చూడాలి. అయితే.. సూర్య43లో అదితిని మెయిన్ హీరోయిన్ గా కాకుండా దుల్కర్ కి జోడిగా చూస్తున్నారని టాక్. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నాడు. మరి సూర్య-సుధా కొంగర మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet