iDreamPost
android-app
ios-app

వివాదానికి తెరలేపిన ప్రకాష్ రాజ్! ‘చంద్రయాన్ 3’ని ఉద్దేశిస్తూ ట్వీట్!

  • Author ajaykrishna Published - 01:31 PM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 01:31 PM, Mon - 21 August 23
వివాదానికి తెరలేపిన ప్రకాష్ రాజ్! ‘చంద్రయాన్ 3’ని ఉద్దేశిస్తూ ట్వీట్!

దేశంలో ఏదైనా విషయం హాట్ టాపిక్ గా మారినప్పుడు.. ఆ విషయంపై దేశమంతటా పాజిటివ్ వైబ్ నడుస్తుందంటే.. ఏమాత్రం నెగిటివ్ గా స్పందించినా జనాల రియాక్షన్ వేరేలా ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే కామెంట్స్ లేదా ట్వీట్స్ సీరియస్ వివాదాలకు కూడా దారి తీయవచ్చు. ప్రస్తుతం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. ‘చంద్రయాన్ 3’ని ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్.. సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇంకొద్ది గంటల్లో చంద్రుడు దక్షిణధృవ ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కానుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. ఇస్రో ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు కాబోతుంది.

ఇస్రో శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. విక్రమ్ ల్యాండర్ ఆగష్టు 23న సాయంత్రం 6:04 గంటల సమయంలో ల్యాండ్ అవుతుందని అంటున్నారు. ఓవైపు రష్యా ప్రయోగించిన లూనా-25 ఫెయిల్ అవ్వడంతో.. ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తున్నాయి. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చంద్రయాన్ 3 గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్.. ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ పెట్టాడు. అయితే.. ఆ ట్వీట్ లో ఫోటో.. ఓ వ్యక్తి లుంగీ ధరించి టీ పోస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా.. ‘బ్రేకింగ్ న్యూస్.. చంద్రుని నుండి వస్తున్న ఫస్ట్ ఫోటో ఇదే. #VikramLander వావ్’ అంటూ కాప్షన్ జోడించాడు.

ఇంకేముంది ప్రకాష్ రాజ్ షేర్ చేసిన పిక్.. ఛాయ్ వాలాని పోలి ఉంది. దీంతో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్.. ఈ ఫోటో వ్యంగ్యంగా పెట్టాడని నెటిజన్స్ మండిపడుతున్నారు. నిజానికి చంద్రయాన్ 3 అనేది ఇండియా మొత్తానికి గర్వకారణం కాబోతుంది. అలాంటిది ప్రకాష్ రాజ్ ఇలా.. వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శాస్త్రవేత్తలను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని.. అయినా చంద్రయాన్ 3 ప్రయోగం ఇస్రోది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రయోగం కాదని ప్రకాష్ రాజ్ పై కౌంటర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్వీట్ పెద్ద వివాదమే రాజేసేలా ఉందంటున్నారు పలువురు ప్రముఖులు. మరి చంద్రయాన్ 3 గురించి ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş