iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పై ‘ఆదిపురుష్’ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Jul 12, 2024 | 11:39 AM Updated Updated Jul 12, 2024 | 11:39 AM

కల్కి మూవీతో రికార్డులు కొల్లగొడుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆదిపురుష్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డార్లింగ్ గురించి అతడు ఏమన్నాడంటే?

కల్కి మూవీతో రికార్డులు కొల్లగొడుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆదిపురుష్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డార్లింగ్ గురించి అతడు ఏమన్నాడంటే?

  • Published Jul 12, 2024 | 11:39 AMUpdated Jul 12, 2024 | 11:39 AM
ప్రభాస్ పై ‘ఆదిపురుష్’ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

పాన్ ఇండియా హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభాస్ పై ఆదిపురుష్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదిపురుష్ మూవీలో రాముడిగా ప్రభాస్ నటించగా.. లక్ష్మణుడిగా బాలీవుడ్ యాక్టర్ సన్నీ సింగ్ నటించాడు. ఇతడు తాజాగా డార్లింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కల్కి మూవీకి ముందు ప్రభాస్ ఆదిపురుష్ అనే మైథలాజికల్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా నటించి మెప్పించాడు. అయితే ఈ మూవీ కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా.. టాక్ పరంగా మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆదిపురుష్ లో లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సన్నీసింగ్ నటించిన విషయం తెలిసింతే. తాజాగా సన్నీసింగ్ ప్రభాస్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

“ప్రభాస్ నాకు సినిమాలో, బయట కూడా పెద్దన్నయ్య లాంటివాడు. మా నాన్నకు కూడా ప్రభాస్ నన్ను తన తమ్ముడిగా చెప్పేవాడు. ఇక మాతో చాలా సరదాగా ఉంటాడు. నా పుట్టినరోజు నాకు చాలా సార్లు కాల్ చేశాడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రభాస్” అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ సింగ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. మా డార్లింగ్ అంతే.. అందరిని ప్రేమగా చూసుకుంటాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibom