iDreamPost
android-app
ios-app

పులివెందులలో నన్నే జగన్ అనుకుని..జీవా ఇంట్రస్టింగ్ కామెంట్స్

Yatra-2, Jiiva: దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర-2. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి తాజాగా జీవా అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Yatra-2, Jiiva: దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర-2. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి తాజాగా జీవా అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

పులివెందులలో నన్నే జగన్ అనుకుని..జీవా ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖలకు సంబంధించిన జీవిత కథలు సినిమాలుగా వచ్చాయి. అయితే వాటన్నింటికి లేని క్రేజ్ దివంగత  నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తెరకెక్కిన సినిమాకు వచ్చింది. 2019లో యాత్ర పేరుతో వైఎస్ఆర్ పై సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. ఈ సినిమాను మహి.వి. రాఘవ్ తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తాజాగా యాత్ర-2 పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్… మూవీ ప్రమోషన్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రలో నటించిన తమిళ్ నటుడు జీవా ఇంటర్వూల్లో పాల్గొంటూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ లా కనిపించేందుకు తాను చేసిన వర్కౌట్స్ గురించి తెలియజేశాడు.

దివంగత నేత , ఉమ్మడి ఏపీ వైఎస్సార్, ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర-2. ఇందులో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి,  వైఎస్ జగన్ గా తమిళ హీరో జీవా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా జీవా ఐడ్రీమ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను వెల్లడించారు. తాను సీఎం జగన్ లాగా కనిపించేందుకు పడిన కష్టం గురించి వివరించారు.

జీవా మాట్లాడుతూ..” మహీగారు నాకు కథ చెప్పి, వైఎస్ జగన్ గారి పాత్ర అన్నప్పుడు షాక్ అయ్యాను. ఏపీ రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు. కానీ జగన్ గారి పాత్ర  చేయడం బాధ్యతగా అనిపిచించింది. జగన్ గారు ఎలా మాట్లాడుతారు, ఎలా నడుస్తారు  అనేవి వీడియోలు చూసి తెలుసుకున్నాను. సీఎం జగన్ లా  ఉండేందు, హావభావాలు ప్రదర్శించేందుకు.. తరచూ ఆయన వీడియోలను చూసేవాడిని. ఎంతలా అంటే.. బ్రష్ చేసే సమయంలో కూడా జగన్ వీడియోలు చేసేవాడిని.

నేను పులివెందుల వెళ్తే.. అందరూ నన్ను జగన్ గారు అనుకుని..దగ్గరకు వచ్చారు. షూటింగ్ సమయంలో రేయింబవళ్లు మా దగ్గరే ఉన్నారు. కొన్ని వేలమంది నైట్ నిద్ర పోకుండా షూట్ చూశారు. అక్కడి ప్రజల ఆప్యాయత చూసి.. చాలా సంతోషం వేసింది. ఇక ఈ సినిమాలో కేవలం ఒకటి, రెండు సీన్లలోనే కాదు, సినిమా మొత్తం ఎమోషన్ అయ్యాను. జగన్ మోహన్ రెడ్డి బయోఫిక్ లో నటించడం చాలా సంతోషంగా ఉంది. అలానే నేను ఇప్పటి వరకు జగన్ గారిని కలవలేదు. కలిసే అవకాశం వస్తే వదులుకోను” అంటూ జీవా యాత్ర-2 సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు.