నటిని బలితీసుకున్న క్యాన్సర్.. డబ్బుల్లేక, చికిత్స అందక కన్నుమూత

అందమైన లోకమనీ.. రంగు రంగులుంటాయనీ.. అందరూ అంటుంటారు.. రామ రామ.. అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా అని ఓ సాంగ్ ఉంది. ఇది సినీ రంగుల ప్రపంచానికి కచ్చితంగా సరిపోతుంది. ఓ నటి.. డబ్బుల్లేక చనిపోయింది.

అందమైన లోకమనీ.. రంగు రంగులుంటాయనీ.. అందరూ అంటుంటారు.. రామ రామ.. అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా అని ఓ సాంగ్ ఉంది. ఇది సినీ రంగుల ప్రపంచానికి కచ్చితంగా సరిపోతుంది. ఓ నటి.. డబ్బుల్లేక చనిపోయింది.

ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. మలయాళ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు సినీ దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఈ ఐదు నెలల కాలంలో అనేక మంది సినీ ప్రముఖులను కోల్పోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో కొంత మంది ప్రముఖులు మృత్యువాత పడిన సంగతి విదితమే. అలాగే యాక్సిడెంట్, హార్ట్ ఎటాక్స్ కారణంగా కూడా చనిపోయినవారున్నారు. ప్రతి ఇండస్ట్రీ ప్రముఖలను పొగొట్టుకుంటుంది. కాగా, కొంత మంది సెలబ్రిటీల పట్ల శాపంగా మారింది క్యాన్సర్. ఈ మహమ్మారి నుండి పలువురు సెలబ్రిటీలు బయపడగా.. మరికొంత మంది ఆ వ్యాధికి తలవించి.. ప్రాణాలు విడిచారు.

మొన్నటికి మొన్న ఇళయ రాజా కుమార్తె భవతారిణీ క్యాన్సర్ బారిన పడి చనిపోయిన సంగతి విదితమే. ఇప్పుడు మరో నటిని క్యాన్సర్ బలి తీసుకుంది.  కోలీవుడ్ నటి విజయ కుమారిని బలి తీసుకుంది ఈ మహమ్మారి. విజయకుమారి తమిళంలో పలు సినిమాలు, సీరియల్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఈ రోడ్ జిల్లాకు చెందిన ఆమె చెన్నైలోని వలసరవాకంలో ఉంటూ సీరియల్స్, సినిమాల్లో నటించేది.  ఇటీవల ఆమె క్యాన్సర్ బారిన పడింది. మూడవ దశలో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించగా.. మూడేళ్ల నుండి ఆమె చికిత్స పొందుతుంది. అయితే సంపాదించినదంతా ఆమె ట్రీట్ మెంట్‌కు సరిపోయేది. చివరకు డబ్లుల్లేక ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సాయం కోరింది.

అయితే ఆర్థిక సహాయం అందేలోపే.. సరైన చికిత్స అందక ఆమె మృత్యువాత పడింది. ఆమె మృతికి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా.. రోగం వస్తే.. అన్నీ అమ్ముకోవాల్సిందే అనడానికి ఈ నటి నిదర్శనం. ఇదిలా ఉంటే.. ఈ రంగుల ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో.. అందులో నటించే వాళ్లకు లక్షల్లో, కోట్లల్లో రెమ్యునరేషన్ వస్తుందని అపోహ ఉంటుంది. కానీ వాస్తవంలో వచ్చే సరికి వేలల్లో కూడా రెమ్యునరేషన్ ఉండదు. చిన్న చిన్న పాత్రలు, సహాయ పాత్రలు చేసే వారికి దొరికే ఉపాధి, జీతం.. మరీ తక్కువ. వాటితోనే తమ పొట్ట పోషించుకుంటూ.. ఇతర అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. రోగాలు వస్తే.. సంపాదించినదంతా దానికే ఖర్చు పెట్టేస్తుంటారు.

Show comments