iDreamPost
android-app
ios-app

షారుక్ ఖాన్ తో నటించడం, నటించకపోవడం నా ఇష్టం: టబు

  • Published Jul 22, 2024 | 8:25 PM Updated Updated Jul 22, 2024 | 8:25 PM

Tabu: టాలీవుడ్  సీనియర్ నటి టబు గురించి ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. కాగా, ఇటీవలే ఈ బ్యూటీ హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఔరోన్ మే కహన్ దమ్ థా సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో ప్రమోషన్స్ లో పాల్గొన్న టబు తాజాగా షారుక్ ఖాన్ సినిమాల్లో నటించడం పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Tabu: టాలీవుడ్  సీనియర్ నటి టబు గురించి ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. కాగా, ఇటీవలే ఈ బ్యూటీ హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఔరోన్ మే కహన్ దమ్ థా సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో ప్రమోషన్స్ లో పాల్గొన్న టబు తాజాగా షారుక్ ఖాన్ సినిమాల్లో నటించడం పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Published Jul 22, 2024 | 8:25 PMUpdated Jul 22, 2024 | 8:25 PM
షారుక్ ఖాన్ తో నటించడం, నటించకపోవడం నా ఇష్టం: టబు

టాలీవుడ్  సీనియర్ నటి ‘టబు’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలసిన అవసరం లేదు. ఎదుకంటే సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలోని తనదైన పాత్రలతో మెప్పిస్తుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా 52 ఏళ్ల వయసులో కూడా తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీగా పలు సినిమాల్లో అలరిస్తుంది. అయితే ఈమె మొదటిగా తెలుగులో  1991లో విడుదలైన ‘కూలీ నెంబర్ వన్’ సినిమాలో  హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక  తొలి సినిమాతోనే మంచి ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత నాగర్జున కూలీ నెంబర్ వన్  సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. దీని తర్వాత బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో అక్కడ పలు సినిమాలు చేస్తూ మళ్లీ తెలుగులో నాగర్జునతో సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా సనిమాలతో సూపర్ హిట్ కొట్టింది.
దీంతో తెలుగులో సక్సేస్ ఫుల్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో పలు సినిమాల్లో చేస్తూ అలరించింది. కానీ, ఆ తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో మళ్లీ బాలీవుడ్ లోకి మకాం మార్చిన ఈ బ్యూటీ అక్కడే పలు సినిమాల్లో అలరిస్తూ బిజిగా మారిపోయింది. ఇకపోతే చివరిగా ఈమె టాలీవుడ్ లో అలా వైకుంఠపురం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా టబు హీందిలో.. అజయ్ దేవ గణ్ హీరోగా  ఔరోన్ మే కహన్ దమ్ థా సినిమాలో నటించారు. కాగా, ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో అందులో పాల్గున్న టబుకు షారుక్ ఖాన్ తో ఎందుకు నటించడం లేదు అనే ప్రశ్న ఎదురవ్వడంతో కీలక పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇటీవలే టబు తన సెకండ్ ఇన్నింగ్స్ ను జోరుగా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తన వయసుకు తగ్గట్టు పాత్రలు చేయడంతో పాటు నెగిటివ్ రోల్స్ చేస్తూ పలు సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే  తాజాగా టబు ‘ఔరోన్ మే కహన్ దమ్ థా’ అనే సినిమాతో త్వరలో  మిడిల్ ఏజ్ యశోదగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా, ఈ  సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో  చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబుకు యాంకర్..  ‘షారుక్  2002లో వచ్చిన ‘సాథియా’  తర్వాత మీరెందుకు మళ్లీ షారుక్‌ ఖాన్‌ తో కలిసి నటించలేదని అడగింది’. దీనికి స్పందించిన టబు.. ”నేను నిర్మాతనో, డైరెక్టరో, స్క్రిప్టు రైటరో కాదు. షారుక్‌తో ఏ హీరోయిన్‌ నటించాలనేది నేనెలా చెప్పగలను? ఆయనతో కలిసి నటించేలా ఏదైనా సినిమా అవకాశం వస్తే అంగీకరించాలా, తిరస్కరించాలా అనేది మాత్రమే నా చేతుల్లో ఉంది.

అలా వచ్చిన వాటిలో..  ఏ ప్రాజెక్టులు రిజెక్ట్‌ చేశానో నాకు తెలుసు. నాలాగే ఆయన కూడా కొన్ని ఛాన్స్‌లకు నో చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా షారుక్‌తో కలిసి నటించాలని చాలామంది ప్రేక్షకులు కోరుకోవడం ఆనందంగా ఉంది” అని టబు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టబు చేసిన షారుక్ ఖాన్ తో సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే..  టబు ఈ సినిమాతో పాటు మరోవైపు, ‘డ్యూన్‌: ప్రాఫెసీ’ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉన్నారు.  మరి, టబు షారుక్ తో సినిమా పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom