iDreamPost
android-app
ios-app

సలార్ విషయంలో శృతి అలిగిందా? ఇంత కామ్ గా ఉందేంటి?

  • Published Dec 12, 2023 | 3:34 PM Updated Updated Dec 12, 2023 | 3:34 PM

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ మాత్రం చిత్ర యూనిట్ ఇంకా ప్రారంభించలేదు. శృతిహాసన్ సలార్ రిలీజ్ కు ముందు కామ్ అయిపోయింది. ఆ వివరాలు మీకోసం..

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్స్ మాత్రం చిత్ర యూనిట్ ఇంకా ప్రారంభించలేదు. శృతిహాసన్ సలార్ రిలీజ్ కు ముందు కామ్ అయిపోయింది. ఆ వివరాలు మీకోసం..

  • Published Dec 12, 2023 | 3:34 PMUpdated Dec 12, 2023 | 3:34 PM
సలార్ విషయంలో శృతి అలిగిందా? ఇంత కామ్ గా ఉందేంటి?

కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సలార్ విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ఇటీవల సెన్సార్ ఫార్మీలిటీస్ కూడా పూర్తి చేసుకున్న సలార్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా హీరో హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రమోషన్లు చేయటం లేదు. ప్రభాస్ మూవీపై ఇప్పుడిదే హాట్ టాపిక్.

హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ మాత్రం అలక చెందినట్లు తెలుస్తోంది. సలార్ లో శృతికి ఎక్కువ ప్రాధాన్యత లేదంట. డైరెకక్టర్ ప్రశాంత్ నీల్ కథాపరంగా ప్రభాస్, పృథ్వీరాజ్ లపై ఫోకస్ పెట్టడంతో శృతికి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతో మూవీ ప్రమోషన్ విషయంలో ఆమె కొంత సైలెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో తన సినిమా రిలీజ్ లకు హడావుడి చేసిన శృతి హాసన్ ఇప్పుడు కామ్ గా ఉండటంతో సలార్ లో తన పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ లేదన్నట్లు తెలస్తోంది.

ఆల్రెడీ శృతిహాసన్ స్టార్ డమ్ ఉన్న హీరోయిన్. తనకు సలార్ మూవీ హిట్ అయినా కాకపోయినా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. ఇదివరకే తన ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. సలార్ లో తన పాత్రకు స్కోప్ లేకపోవడం వల్ల తనకొచ్చే నష్టం ఏమీ లేదు. ఇక సలార్ మూవీ ప్రమోషన్స్ కు హీరో ప్రభాస్ కూడా దూరంగా ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సలార్ మూవీకి ప్రమోషన్స్ ప్రారంభించకపోవడంతో కారణాలేంటని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఏదీ ఏమైనా ఇటీవల విడుదలైన సలార్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరి శృతిహాసన్ సినిమా ప్రమోషన్ విషయంలో కామ్ గా ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş