iDreamPost
android-app
ios-app

వాడితో 15 ఏళ్ల బంధం.. ఒక్కసారిగా దూరమయ్యేసరికి.. నటి సన కన్నీళ్లు!

  • Published Apr 20, 2024 | 5:19 PM Updated Updated Apr 20, 2024 | 5:19 PM

Shanoor Sana Emotional Video: టాలీవుడ్ సీనియర్ నటి షానూర్ సనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల సన ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు.

Shanoor Sana Emotional Video: టాలీవుడ్ సీనియర్ నటి షానూర్ సనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల సన ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు.

  • Published Apr 20, 2024 | 5:19 PMUpdated Apr 20, 2024 | 5:19 PM
వాడితో 15 ఏళ్ల బంధం.. ఒక్కసారిగా దూరమయ్యేసరికి.. నటి సన కన్నీళ్లు!

సీనియర్ నటి షానూర్ సనకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. తల్లి, ఒదిన, భార్య, అక్క ఇలా పాత్ర ఏదైనా తన నటనతో ఆడియన్స్ ని మెప్పించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరీర్ లో దూసుకెళ్తోంది. తన కోడలు కూడా నటే అన్న విషయం అందిరికీ తెలుసు. సన అటు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. తనకు షానూరు సన అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో తన ఫ్యామిలీ, కొడుకు, కోడలు ఇలా అన్ని విషయాలకు సంబంధించిన వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన భర్తకు వచ్చిన గుండెనొప్పి గురించి కూడా ఆ ఛానల్ లోనే తెలియజేసింది. ఇప్పుడు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదం గురించి కూడా నటి సన వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకుంది.

నటి సన భర్తకు ఇటీవల ఛాతినొప్పి వచ్చిన విషయం తెలిసిందే. జ్వరం, టాబ్లెట్స్, ఆస్పత్రి అంటే తెలియని తన భర్త ఒక్కసారిగా ఛాతి నొప్పి అనగానే అంతా కంగారు పడిపోయామని చెప్పింది. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత గుండెలో రక్తనాళం బ్లాక్ అయ్యిందని తెలిసిందని.. ఇప్పుడు అంతా బాగానే ఉన్నట్లు చెప్పింది. అలాగే గుండెనొప్పికి సంబంధించి కొంత అవగాహన కూడా కల్పించే ప్రయత్నం చేసింది. ఛాతినొప్పి అనేది కేవలం ఎడమవైపునే రావాలి అనేం ఉండదని.. మెడ దగ్గరి నుంచి ఛాతి వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చని వైద్యుల చెప్పిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. అలాగే అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే వారి కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తమ పెంపుడు శునకం రాక్సీ చనిపోయిన విషయాన్ని వెల్లడించారు.

“నాకు రాక్సీ అంటే ఎంతో ఇష్టం. నేను షూటింగ్ నుంచి రాగానే రాక్సమ్మ అనగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ రోజు వాడికి ఏదో ఇబ్బిందిగా ఉందని చిన్న అరుపు అరిచింది. ఆ తర్వాత వాంతులు చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆ రోజు పండుగ అందరూ ఎంతో సంతోషంగా ఉండాల్సింది. కానీ, అలా ఆస్పత్రిలో ఉన్నారు. నాకు వీడియో కాల్ చేసి చూపించారు. నేను అక్కడికి వెళ్లి చూశాను కూడా. వాడు ఎంతో వీక్ గా ఉన్నాడు. నేను తీసుకెళ్తాను వచ్చేయ్ అంటే.. నా చేయి పక్కకు నెట్టేశాడు. అంటే నేను రాను అర్థం. నేను వెళ్లడం లేదని ఓపిక లేకపోయినా పైకి లేచి అటు వైపు తిరిగాడు. ఇంక నేను కూడా ఎంతో బాధతో వచ్చేశాను. ఎవరైనా ఒకరోజు వెళ్లిపోవాల్సిందే. ఆ రోజు వాడు అలా దూరమయ్యాడు. నేను బాధ పడితే వాడి ఆత్మ శాంతించదు. అందునే నేను కూడా నార్మల్ అయిపోయాను. ఇక నుంచి సాధారణంగానే వీడియోలు చేస్తాను” అంటూ నటి షానూర్ సన కన్నీళ్లు పెట్టుకుంటూ తన వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss