iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు! పాయల్ రాజ్ పుత్ సంచలన కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 03:52 PM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 03:52 PM, Sat - 1 July 23
ఆ డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు! పాయల్ రాజ్ పుత్ సంచలన కామెంట్స్..

సినిమా ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని పేరు.. కొందరికి ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అయితే ఆ పేరును నిలబెట్టుకోవడం, నిలబెట్టుకోకపోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. అలా ఒకే ఒక్క చిత్రంతో టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హాట్ భామ. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. పాయల్ కు సినిమా ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి. అయితే కథల ఎంపికలో చేసిన తప్పుల వల్ల.. ఆ మూవీలు సరిగ్గా ఆడకపోవడంతో పాటుగా, ఈ అమ్మడికి పేరును కూడా తేలేకపోయాయి. తాజాగా మాయా పేటిక, మంగళవారం సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐ డ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలు వెల్లడించింది. తనను కొందరు డైరెక్టర్లు వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 మూవీతో ఇండస్ట్రీ మెుత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. అయితే ఆ తర్వాత చేసిన ఏ సినిమా కూడా మళ్లీ అంతలా సక్సెస్ కాలేదు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పాయల్ కు ఆర్ఎక్స్ 100 లాంటి సరైన హిట్ లేదు. తాజాగా మయాపేటిక, మంగళవారం సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది ఈ బోల్డ్ బ్యూటీ. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది.

తన తొలి సినిమా తర్వాత పాయల్ హైదరాబాద్ లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే కొందరు డైరెక్టర్లు తనను మిస్ గైడ్ చేశారని చెప్పుకొచ్చింది. ఇక మరికొంత మంది డైరెక్టర్లు తనను వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ సినిమాకైనా వందకు రెండువందల శాతం ఎఫర్ట్స్ పెడతాను, కానీ ఆ సినిమాలు వర్కౌట్ అవ్వడం, కాకపోవడం నా చేతుల్లో లేదు అని పాయల్ చెప్పుకొచ్చింది. కాగా.. తన తొలి సినిమా తర్వాత కొందరు డైరెక్టర్ల మిస్ గైడెన్స్ వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఇక మరికొంతమంది నన్ను అడ్వాంటేజ్ గా తీసుకున్న విషయాన్ని నేను గుర్తించానని పాయల్ రాజ్ పుత్ పేర్కొంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి అన్న విషయాల్లో మెచ్యూరిటీ వచ్చిందని వివరించింది. ఇక తెలుగులో పాయల్ కు తొలి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లోనే మంగళవారం అనే సినిమా చేసింది పాయల్ రాజ్ పుత్.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet