iDreamPost
android-app
ios-app

వాళ్లతో పడుకొని ఉంటే ఈపాటికి 30 సినిమాలు అయ్యేవి: పాయల్ ఘోష్

  • Author ajaykrishna Published - 02:54 PM, Fri - 7 July 23
  • Author ajaykrishna Published - 02:54 PM, Fri - 7 July 23
వాళ్లతో పడుకొని ఉంటే ఈపాటికి 30 సినిమాలు అయ్యేవి: పాయల్ ఘోష్

ఒకసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత హీరోలైనా, హీరోయిన్స్ అయినా కెరీర్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం మామూలే. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా భరించి సక్సెస్ అవుతారు. మరికొందరు ఇంకా టైమ్ వేస్ట్ చేసుకోవద్దని మానుకుంటారు. అయితే.. నటులుగా సక్సెస్, ఫెయిల్ అనేది హార్డ్ వర్క్ చేస్తే తెలుస్తుంది. ఆ హార్డ్ వర్క్ చేయాలంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అడ్డుగా వస్తుందని కొందరు హీరోయిన్స్ వాదన. కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ పై పోరాటాలు, వ్యతిరేక నినాదాలు వినబడుతూనే ఉన్నాయి. అయితే.. తాను కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోయి ఉంటే ఈపాటికి 30 సినిమాలు చేసేదాన్ని అని సంచలన కామెంట్స్ చేసింది నటి పాయల్ ఘోష్.

పాయల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. గతంలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించింది. కానీ.. ఆమె అదృష్టం బాలేక చేసిన సినిమాలు ఏవి కూడా మంచి పేరు తీసుకురాలేక పోయాయి. దీంతో అవకాశాలు కూడా లేకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడకూడా అమ్మడికి ఎదురు దెబ్బలే తగిలాయని అంటోంది. పాయల్ చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా ఏదొక కాంట్రవర్సీ ద్వారా వార్తల్లో నిలుస్తుంటుంది. ఆ మధ్య బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పెద్ద దుమారమే రేపింది. తాజాగా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల పాయల్ సోషల్ మీడియాలో తన 11వ సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సినిమా గురించి చెబుతూ.. ఇది నా 11వ సినిమా. ఇండస్ట్రీలో కొంతమందికి లొంగిపోయి వారితో పడుకొని ఉండుంటే.. ఇది పక్కాగా నా 30వ సినిమా అయ్యేది అనే విధంగా తీవ్రవ్యాఖ్యలు చేసింది పాయల్. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పీక్స్ లో ఉందని.. కొన్ని కావాలంటే కొన్నిటికి లొంగిపోవాల్సి వస్తుంది అన్నట్లు అమ్మడు చిచ్చు రాజేసింది. ప్రెజెంట్ పాయల్ ఘోష్ కామెంట్స్ సోషల్ మీడియాలో.. సినీ వర్గాలలో సంచలనంగా మారాయి. అయితే.. గతంలో కన్నా కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక తగ్గిందని చెప్పాలి. మరి పాయల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom