iDreamPost
android-app
ios-app

కో-స్టార్ ను పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్! వైరలవుతున్న ఫోటోలు

  • Author Soma Sekhar Published - 09:20 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 09:20 PM, Mon - 24 July 23
కో-స్టార్ ను పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్! వైరలవుతున్న ఫోటోలు

ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు పెళ్లి బాట పడుతున్నారు. ఇప్పటికే పలు సినిమా పరిశ్రమలకు చెందిన నటీ, నటులు పెళ్లిపీటలెక్కి.. తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇందులో హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు మరికొందరు సినిమా వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది ఓ యంగ్ హీరోయిన్. ఇప్పటి వరకు ప్రేమలో ముగినిపోయిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటైయ్యారు. తన కో-స్టార్ నే ఆ హీరోయిన్ మ్యారేజ్ చేసుకోవడం గమనార్హం. మరి తన సహ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నూరిన్ షరీఫ్.. ‘లవర్స్ డే’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ నూరిన్ అయినప్పటికీ.. ప్రియా ప్రకాశ్ వారియర్ కే ఎక్కడా లేని గుర్తింపు వచ్చింది. ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో మలయాళంలోనే నటిగా స్థిరపడిపోయింది. తొలుత డ్యాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించిన నూరిన్ షరీఫ్.. క్రమంగా నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

కాగా.. ఓ సినిమాకు పనిచేస్తున్న టైమ్ లో రైటర్ కమ్ యాక్టర్ అయిన ఫహిమ్ సఫర్ తో నూరిన్ కు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో గతేడాది డిసెంబర్ లో పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా తిరువనంతపురంలో గ్రాండ్ గా తమ పెళ్లిని జరుపుకున్నారు. ఇక ఈ కొత్త దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన పెళ్లి ఫోటోలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by AVALON WEDDINGS (@avalonweddings)

 

View this post on Instagram

 

A post shared by Noorin Shereef (@noorin_shereef_)


ఇదికూడా చదవండి: నన్ను లైంగికంగా వేధించారు, చంపేస్తామని బెదిరించారు: కిర్రాక్ సీత