iDreamPost
android-app
ios-app

నన్ను లైంగికంగా వేధించారు, చంపేస్తామని బెదిరించారు: కిర్రాక్ సీత

  • Author Soma Sekhar Published - 08:14 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 08:14 PM, Mon - 24 July 23
నన్ను లైంగికంగా వేధించారు, చంపేస్తామని బెదిరించారు: కిర్రాక్ సీత

బేబీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి నోటా వినిపిస్తున్న పేరు. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలను తీసుకొస్తూ.. థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇక ఇందులో నటించిన అందరు నటులు తమ పాత్రల్లో జీవించేశారు. అలాంటి వారిలో హీరోయిన్ ఫ్రెండ్ గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన కిర్రాక్ సీత ఒకరు. ఈ చిత్ర విజయంతో.. వరుసగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించడమే కాకుండా.. చంపుతామని బెదిరించినట్లు చెప్పుకొచ్చింది.

కిర్రాక్ సీత.. యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్ తీయడం ద్వారా ఫేమస్ అయ్యింది. దాంతో పలు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బేబీ సినిమాలో మంచి క్యారెక్టర్ ను దక్కించుకుంది తను. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటుగా.. తన క్యారెక్టర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది కిర్రాక్ సీత. ఈ ఇంటర్య్వూలో తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ..”ఓ రోజు నేను ఒక ఈవెంట్ కు వెళ్లోస్తున్నాను. అయితే ఆ టైమ్ లో కొందరు ఆకతాయిలు నా వెంట పడ్డారు. దాంతో వెంటనే నేను నా ఫ్రెండ్స్ కు ఫోన్ చేశా. వారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. కానీ నేను అలా చేయలేదు. ఆ ఆకతాయిల్లో కొందరు నన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని బెదిరించారు. కానీ నేను వీటన్నింటినీ లైట్ తీసుకున్నాను” అని కిర్రాక్ సీత చెప్పుకొచ్చింది. వారందరు నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి ఆ అభిప్రాయానికి వచ్చారని ఆమె పేర్కొంది. నా రియల్ లైఫ్ వేరే అని వారికి తెలీదు. అందుకే వారిని పట్టించుకోలేదని తెలిపింది కిర్రాక్ సీత.

ఇక కిర్రాక్ సీత కెరీర్ స్టార్టింగ్ లో 7ఆర్ట్స్ సరయూతో కలిసి వర్క్ చేసింది. కాగా.. ఏదో సమస్య కారణంగా ఆమెతో వీడియోలు తీయ్యడం మానేసింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ.. వస్తోంది కిర్రాక్ సీత. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. మరి కిర్రాక్ సీత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş