iDreamPost
android-app
ios-app

Dhanush: ధనుష్ కు షాకిచ్చిన తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్! ఇక నుంచి..

  • Published Jul 30, 2024 | 9:44 AM Updated Updated Jul 30, 2024 | 9:44 AM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటుగా కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటుగా కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 30, 2024 | 9:44 AMUpdated Jul 30, 2024 | 9:44 AM
Dhanush: ధనుష్ కు షాకిచ్చిన తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్! ఇక నుంచి..

కోలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి(TFPC) తాజాగా ఓ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇండస్ట్రీ అభ్యున్నతి కోసం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో భాగంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని, ఆగస్ట్‌ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, అలాగే నవంబర్‌ 1 నుంచి సినిమా సంబంధిత కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో స్టార్ హీరో ధనుష్ కు ఊహించని షాకిచ్చింది కౌన్సిల్. ఆ వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తాజాగా ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలతో పాటుగా ధనుష్ పై కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. కొందరి నిర్మాతల దగ్గర భారీగా అడ్వాన్స్ తీసుకుని షూటింగ్స్ రావడం లేదన్నది ధనుష్ పై ఉన్న అభియోగం. దాంతో ధనుష్ తో కొత్త సినిమాలు ప్రారంభించే ముందు.. అతడికి అడ్వాన్స్ ఇచ్చిన పాత సినిమా నిర్మాతలను ఓసారి సంప్రదించాలని పేర్కొంది. అదీకాక ఈ విషయాన్ని మండలికి కూడా తెలియజేయాలని సూచించింది.

Dhanush

కాగా.. గత ఏడాది శ్రీ తేనాండాళ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నుంచి ధనుష్‌ భారీ మొత్తంలో అడ్వాన్స్‌ తీసుకొని, షూటింగ్‌కి మాత్రం రాలేదనే అభియోగం ఉందని TFPC తెలిపింది. అయితే ధనుష్ ను కొందరు పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్ కు మద్దతుగా నిలిచింది. హీరోను సంప్రదించకుండానే ఇలాంటి ఆంక్షలు ఎలా విధిస్తారని ఆ సంఘం ప్రశ్నించింది. తమిళ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ధనుష్ కు నిజంగా షాక్ అనే చెప్పాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş