iDreamPost
android-app
ios-app

బేటీ బేటీ అనేవారు.. అలా చేస్తారని అనుకోలేదు: మన్నారా

  • Author ajaykrishna Updated - 03:15 PM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 03:15 PM, Sat - 2 September 23
బేటీ బేటీ అనేవారు.. అలా చేస్తారని అనుకోలేదు: మన్నారా

ఇటీవల టాలీవుడ్ లో దర్శకుడు ఏఎస్ రవికుమార్.. హీరోయిన్ మన్నారాని ముద్దాడిన ఘటన చిన్నపాటి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తో ‘తిరగబడరా సామీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న ఏఎస్ రవికుమార్.. ఓ ప్రెస్ మీట్ లో మీడియా ముందు మన్నారా చోప్రా భుజాలపై చేయి వేసి బుగ్గలపై గట్టిగా ముద్దు పెట్టాడు. అసలు ఎక్స్ పెక్ట్ చేయని మన్నారా.. ఆయన అలా ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ ముద్దు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. డైరెక్టర్ పై నెటిజన్స్ ఊహించని రేంజ్ లో ట్రోల్స్ చేశారు. పబ్లిక్ లో అమ్మాయి పట్ల ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అంటూ కామెంట్స్ చేశారు.

ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్.. ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ ని ముద్దు పెట్టుకోవడంలో తప్పేముంది? అని అడిగాడు. ఆమెను కూతురిలా భావించి.. అలా ఆప్యాయంగా ముద్దు పెట్టాను. అంతేగాని అందులో తప్పుగా అనుకోవడానికి ఏం లేదని.. తన కూతురిని కూడా అలాగే ముద్దు పెట్టుకుంటానని చెప్పాడు. పైగా ముద్దు పెట్టించుకున్న హీరోయిన్ కి లేని ప్రాబ్లెమ్ మీ అందరికి ఎందుకు? అని గట్టిగా ప్రశ్నించాడు. డైరెక్టర్ రియాక్ట్ అవ్వడంతో సద్దుమణిగుంది అనుకుంటే.. ఆయన మీకెందుకు నొప్పి అని అడగడంతో మళ్లీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఎట్టకేలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మన్నారా.. డైరెక్టర్ ముద్దు ఘటనపై స్పందించింది.

డైరెక్టర్ రవికుమార్ తనను తప్పుడు ఉద్దేశంతో ముద్దాడి ఉండరు అని సమర్థించింది మన్నారా. ఆమె మాట్లాడుతూ.. “డైరెక్టర్ నన్ను బేటీ బేటీ అని పిలుస్తుంటారు. అదే ఆప్యాయతతో నన్ను ఆరోజు ముద్దాడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన ముద్దాడిన విధానంలో నాకేం తప్పుగా అనిపించలేదు. కాకపోతే సడన్ గా అలా చేస్తారని అనుకోలేదు.. కాస్త కంగారు పడ్డాను అంతే.” అంటూ మన్నారా సెలవిచ్చింది. సో.. ఆ ముద్దు వివాదంలో రియాక్ట్ అవ్వాల్సిన ఇద్దరు రియాక్ట్ అయ్యారు. కాబట్టి.. ఇక ఆ వివాదానికి తెరపడినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ ముద్దు పట్ల హీరోయిన్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.