iDreamPost
android-app
ios-app

వివాదంలో స్టార్ హీరోయిన్! ఇంత పెద్ద విషయం తెలుసుకోకుండా..

  • Published Jun 29, 2024 | 2:55 PM Updated Updated Jun 29, 2024 | 2:55 PM

ఓ కంపెనీకి చెందిన ప్రచార ఒప్పంద విషయంలో స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దాంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు? ఆ ఒప్పందం ఏంటి? పూర్తి వివరాలు..

ఓ కంపెనీకి చెందిన ప్రచార ఒప్పంద విషయంలో స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దాంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు? ఆ ఒప్పందం ఏంటి? పూర్తి వివరాలు..

  • Published Jun 29, 2024 | 2:55 PMUpdated Jun 29, 2024 | 2:55 PM
వివాదంలో స్టార్ హీరోయిన్! ఇంత పెద్ద విషయం తెలుసుకోకుండా..

ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీ, నటులు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేం కాదు. అయితే కొన్ని విషయాల్లో తమకు సంబంధం లేకున్నా చిక్కుల్లో పడుతూ ఉంటారు కొందరు నటీ మణులు. ఇంకొందరు మాత్రం అవగాహణ లోపంతో వివాదాల్లో పడుతుంటారు. తాాజాగా ఓ విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఓ కంపెనీ ప్రచారానికి ఒప్పుకోవడంతో పెద్ద వివాదంలో చిక్కుకుంది సీనియర్ స్టార్ హీరోయిన్. మరి ఆ ఒప్పందం ఏంటి? ఆ వివాదం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఓ కంపెనీకి చెందిన ప్రచార ఒప్పంద విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అసలు ఏం జరిగిందంటే? రెహన్ సిద్ధిఖీ అనే అమెరికన్ వ్యాపారవేత్త ఆగస్టులో తన కంపెనీల ప్రమోషన్ కోసం టెక్సాస్ లో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నాడు. ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె ఈ ఈవెంట్ కు హాజరుకానున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ సంతతికి చెందిన రెహన్ సిద్ధిఖీకి ISIతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో.. అతడికి సంబంధించిన అన్ని వ్యాపారాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ క్రమంలో మాధురి దీక్షిత్ అతడి కంపెనీకి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనబోతుందన్న విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

కాగా.. టెక్సాస్ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ ను పొలిటికల్ కాలమిస్ట్ సునంద వశిష్ట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందుంలో సిద్ధిఖీ, మాధురి దీక్షిత్ ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ గా మారాడంతో.. నెటిజన్లు మాధురిపై విమర్శలు చేస్తున్నారు. ఐఎస్ఐ లాంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రచార కర్తగా ఉండటం ఏంటి? ఈవెంట్ లో పాల్గొనడానికి సిద్దపడటం ఏంటి? తక్షణమే ఆమె ఈ ఈవెంట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై మాధురి దీక్షిత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss