iDreamPost
android-app
ios-app

నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. త్వరలో కల్కి-2! అంతా రెడీ!

  • Published Jun 29, 2024 | 2:04 PM Updated Updated Jun 29, 2024 | 2:04 PM

Kalki-2 Coming Soon.. డార్లింగ్ ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. కల్కి 2898 ఏడీతో బాక్సాఫీసును ఊచకోత కోస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. సీక్వెల్ కూడా..

Kalki-2 Coming Soon.. డార్లింగ్ ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. కల్కి 2898 ఏడీతో బాక్సాఫీసును ఊచకోత కోస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. సీక్వెల్ కూడా..

  • Published Jun 29, 2024 | 2:04 PMUpdated Jun 29, 2024 | 2:04 PM
నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..  త్వరలో కల్కి-2! అంతా రెడీ!

థియేటర్ల దగ్గర రెబలోడి ఊచకోత కొనసాగుతుంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 191.5 కోట్లను వసూలు చేసింది. తొలి రోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రెండు రోజుల్లో రూ. 150 నెట్ వసూళ్లను టచ్ చేసింది. పాజిటివ్ రివ్యూస్, రేటింగ్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. స్టార్ సెలబ్రిటీలు సైతం సినిమాపై, దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే..శుక్రవారం కాస్త కలెక్షన్స్ తగ్గినప్పటికీ.. వీకెండ్ ఉండటంతో భారీ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. అలాగే ఈ వారంలో కల్కి వెయ్యి కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయనుందని భావిస్తున్నారు.

భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇతి హాస గాధలకు..సైన్స్ ఫిక్షన్ జత చేసి వావ్ అనిపించాడు. ఇక యాక్టర్స్ గురించి చెప్పనక్కర్లేదు. అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కాకుండా దీపికా,దిశా పటానీ ముద్దుగుమ్మలు ఉన్నంతలో కట్టిపడేశారు. మాళవిక, అన్నాబెన్, శోభన, రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, ఫరియా వంటి క్యామియోస్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇంత మందితో సినిమా తీసి పెద్ద సాహసమే చేసింది నిర్మాణ సంస్థ. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు అశ్వినీదత్. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు దండం పెట్టేస్తున్నారు ఆడియన్స్. ఇక ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్‌లో పొగిడేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంటస్రింగ్ అప్డేట్ వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ బొమ్మకు సీక్వెన్స్ తెరకెక్కుతోన్న సంగతి విదితమే.  అయితే కల్కి పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. నాగీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. అదేంటంటే.. ఇప్పటికే సీక్వెల్ కూడా 60 శాతం కంప్లీట్ అయిపోయిందట. కొన్ని మేజర్ పోర్షన్ షూట్ చేయాల్సి ఉందట. అయితే ఇంతకు ఎప్పుడు రిలీజ్ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది. తొలి పార్ట్ సమయంలోనే ఇది కంప్లీట్ చేశారట. అందుకే రూ. 600 కోట్లు అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కల్కి పార్ట్ 2 కోసం.. పది రోజులు సెలవు తీసుకుని వర్క్ చేస్తానని గతంలో నాగ్ అశ్విన్ కూడా ఎనౌన్స్ చేశాడు.  ఈ లెక్కన వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss