iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో వారి కోరికలు తీర్చిన ఆడవారికే అవకాశాలు: కస్తూరి శంకర్!

గృహ లక్ష్మి సీరియల్ తో అందరికి దగ్గరైన నటి కస్తూరి శంకర్. ప్రస్తుతం ఈ ధారావాహికకు తెరపడింది. కాగా, ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

గృహ లక్ష్మి సీరియల్ తో అందరికి దగ్గరైన నటి కస్తూరి శంకర్. ప్రస్తుతం ఈ ధారావాహికకు తెరపడింది. కాగా, ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో వారి కోరికలు తీర్చిన ఆడవారికే అవకాశాలు: కస్తూరి శంకర్!

ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే నటి కస్తూరి శంకర్. ఇంటింటి గృహలక్ష్మితో అలరించిన కస్తూరి.. తనకు నచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. టాప్ లెస్ ఫోటో షూట్స్ చేసి లైమ్ లైట్లోకి వచ్చిన శంకర్.. సామాజిక సమస్యలపై మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ  ఉంటుంది. తాజాగా నయన తార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా పిల్లలు కనడంపై స్పందిస్తూ.. ఓ ట్వీట్ చేసిన సంగతి విదితమే. ఆమె తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నిప్పురవ్వ, గ్యాంగ్ వార్, సొగ్గాడి పెళ్లాం, అన్నమయ్య, చిలక్కొట్టుడ, మెరుపు, రథ యాత్ర, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి డాన్ శీను, శమంతక మణి, గాడ్ ఫాదర్ సినిమాల్లో కనిపించింది.

తాజాగా ఈ అమ్మడు మరో బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం. కాస్టింగ్ కౌచ్. దీనిపై తాజాగా స్పందించింది కస్తూరి. ఇండస్ట్రీలోకి కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్ డమ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు గురై ఉంటుంది. కానీ చాలా మంది ఒప్పుకోరు. కానీ నాకు అలాంటి అనుభవాలు ఎదుర్కొలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయిలు..కెరీర్ ఆరంభంలో దీన్ని ఫేస్ చేయాల్సిందే.  అమ్మాయిలు లొంగితేనే అవకాశాలు ఉంటయి.  నేను ఒప్పుకోలేదని చాలా సినిమాల్లో నుండి తీసేశారు. తెలుగులో అయితే అలాంటి అనుభవాలు ఎదుర్కోలేదు’అని వెల్లడించారు.

‘ఇక మలయాళ ఇండస్ట్రీలో వరస్ట్ ఎక్స్ పీరియన్స్ చేశా. పెళ్లైన తర్వాత మలయాళంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి అంగీకరించలేదని మధ్యలో నుండే తీసేశారు. అన్ని రంగాల్లో ఈ తరహా అనుభవాలు ఎదురౌతున్నాయి. అంతెందుకు ఒక బిల్డింగ్ కడుతుంటే.. మేస్ట్రీకి కూలీకి మధ్య ఎఫైర్స్ ఉంటాయి. ప్రతి చోటా లైంగిక వేధింపులు తప్పదు. చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు. అందరూ చెడ్డవారు కాదు. నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని నేను పరిశ్రమను వదిలి వెళ్లలేదు కదా. 80 సినిమాలు చేశాను. ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయి. అందువల్ల చిత్ర పరిశ్రమను తప్పుబట్టడానికి వీల్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది కస్తూరి