iDreamPost
android-app
ios-app

ఫైట్ మాస్టర్ అరెస్ట్ విషయంలో నటి కస్తూరి ఎంట్రీ! కాంట్రవర్సీ వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 01:52 PM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 01:52 PM, Wed - 12 July 23
ఫైట్ మాస్టర్ అరెస్ట్ విషయంలో నటి కస్తూరి ఎంట్రీ! కాంట్రవర్సీ వీడియో వైరల్!

ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా రియాక్ట్ అయ్యేవారు కొందరుంటారు. కొంతమంది మాకెందుకులే అని లైట్ తీసుకుంటే.. కొందరు మాత్రం వాళ్లకు సంబంధం లేకపోయినా విషయంలో తలదూర్చి హైలైట్ అవుతుంటారు. ఒక విషయంపై స్పందించడంలో తప్పులేదు. కానీ.. ప్రతీ దానికి రియాక్ట్ అయితే కొన్నిసార్లు తంటాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. పైగా పెద్ద ఎత్తున ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా ఇవన్నీ లెక్క చేయకుండా ఇష్యూలో అడుగు పెట్టేవారిలో నటి కస్తూరి ముందుంటుంది. కస్తూరి గురించి అటు సినీ ప్రేక్షకులకు, ఇటు డైలీ సీరియల్ లవర్స్ కి పరిచయం అవసరం లేదు.

కస్తూరి అంటే ఈ మధ్య నటిగా మాత్రమే కాదు. సోషల్ ఆక్టివిస్ట్ గా.. కూడా బాగా పాపులర్ అయ్యింది. ఎక్కడ ఇష్యూ జరిగినా సోషల్ మీడియా వేదికగా తన గొంతు సవరిస్తూ ఉంటుంది. లేనిపోని తంటాలు కొని తెచ్చుకుంటుంది. పైగా కొన్నాళ్ళుగా వివాదాలకు అడ్డాగా కూడా మారింది కస్తూరి. గృహలక్ష్మి సీరియల్ లో తులసి క్యారెక్టర్ తో తెలుగు జనాలకు బాగా దగ్గరైన కస్తూరి.. సమాజంలో జరిగే అన్యాయాలు, సమస్యలపై రియాక్ట్ అవుతుంటుంది. నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఎదురైనా ఇంకా ధీటుగా నిలబడుతుంది గాని.. పెద్దగా భయపడదు. ఈ విషయం ఆల్రెడీ పలుమార్లు ప్రూవ్ చేసుకుంది. ఏదైనా గట్టిగానే నొక్కి చెప్పాలని చూస్తుంది.

అలాంటి కస్తూరి రీసెంట్ గా తమిళ సినిమా స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ అరెస్ట్ అయిన విషయంలోను రియాక్ట్ అయ్యింది. ఓ పాస్టర్ ఒక యువతితో డాన్స్ చేసిన వీడియోని చేసిన కనల్ కన్నన్.. సదరు మతాన్ని కించపరిచే విధంగా ట్వీట్ చేశాడని.. డిఎంకే పార్టీకి చెందినవారు సైబర్ కేసు వేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. సదరు వీడియోని కస్తూరి కూడా షేర్ చేస్తూ.. “నిజమైన వీడియోనే కదా మార్ఫింగ్ చేసినట్లు లేదుగా? అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా చాలామంది వీడియోపై రియాక్ట్ అవుతున్నారు.. కామెంట్స్ పెడుతున్నారు. అలా అని దాన్ని మార్ఫింగ్ చేశారని అర్ధం కాదు కదా? ఈ వీడియో షేర్ చేసినందుకు కనల్ కన్నన్ ని అరెస్ట్ చేశారు.” అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. దీనికి కొందరు కస్తూరిని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. మరి కనల్ కన్నన్ ఇష్యూలో కస్తూరి రియాక్షన్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet