iDreamPost
android-app
ios-app

Jyothi Roy: ఆ డైరెక్టర్ తో పెళ్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిరాయ్ నటి!

  • Published Jun 08, 2024 | 10:54 AM Updated Updated Jun 08, 2024 | 10:54 AM

జ్యోతిరాయ్ గురించి తెలుగు బుల్లితెర ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ముఖ్యంగా ఆ సీరియల్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఓ డైరెక్టర్ తో పెళ్లి విషయంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

జ్యోతిరాయ్ గురించి తెలుగు బుల్లితెర ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ముఖ్యంగా ఆ సీరియల్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఓ డైరెక్టర్ తో పెళ్లి విషయంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published Jun 08, 2024 | 10:54 AMUpdated Jun 08, 2024 | 10:54 AM
Jyothi Roy: ఆ డైరెక్టర్ తో పెళ్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిరాయ్ నటి!

సినిమాలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు అందరు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలానే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు. అలానే ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తమ వ్యక్తిగత విషయాలను కూడా మీడియా పంచుకుంటారు. అలానే గుప్పెడంత మనస్సు సీరియల్ నటి జ్యోతిరాయ్ కూడా ఓ  వేడుకలో తన పెళ్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. ఓ డైరెక్టర్ పై సంచనల కామెంట్స్ చేసింది.

జ్యోతిరాయ్ గురించి తెలుగు బుల్లితెర ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ముఖ్యంగా ఆ సీరియల్ లో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఓ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాకు జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో కూడిన సూప‌ర్ హీరో మూవీగా ఏ మాస్ట‌ర్ పీస్  సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తాజాగా  సినిమాకు సంబంధించిన టీజ‌ర్ విడుదలైంది. అందులోని విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

శుక్రవారం ఏ మాస్టర్ పీస్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నటీ నటులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరాయ్ అనేక విషయాలను షేర్ చేసుకున్నరు. ఏ మాస్ట‌ర్ పీస్‌తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కావడంపై జ్యోతి రాయ్ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో త‌న‌ వ్యక్తిగత జీవితం ఒక మలుపు తీసుకుంద‌ని తెలిపింది. అదే మలుపే డైరెక్ట‌ర్‌ సుకుతో త‌న పెళ్టి జ‌రిగింద‌ని జ్యోతి రాయ్ అన్న‌ది. సుకు పూర్వజ్ తో పెళ్లి త‌ర్వాత టాలీవుడ్ త‌న‌కు మెట్టినిల్లు అయిపోయింద‌ని జ్యోతిరాయ్ తెలిపింది. ఇక నుంచి తెలుగులో నమూవీస్ కంటిన్యూ చేస్తాన‌ని జ్యోతి రాయ్ పేర్కొన్న‌ది.

ఇక జ్యోతిరాయ్ గురించి వస్తే.. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరైంది. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్‌లో ఆమె క్యారెక్ట‌ర్ ముగిసింది. బుల్లితెరపై మెప్పించిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన ప్రతిభను చూపేందుకు సిద్ధమైంది.  ఇక దర్శకుడు సుకు విషయానికి వస్తే..ఆయనకు ఇది మూడో సినిమా. గతంలో శుక్ర, మాటరాని మౌనమిది.. లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సుకు పూర్వజ్..తాజాగా ఏ మాస్టర్ పీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే సుకు పూర్వ‌జ్‌, జ్యోతి రాయ్ మ‌ధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారితీసింది. దర్శకుడు సుకు పూర్వాజ్‌తో పెళ్లి త‌ర్వాత త‌న ఇంటి పేరును తన పేరుకు చివర చేర్చుకుని జ్యోతి పూర్వ‌జ్‌గా మార్చుకుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş