iDreamPost
android-app
ios-app

Jaya Prada: ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్!

అలనాటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి.. ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఆమె ఓ కేసులు నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.

అలనాటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి.. ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఆమె ఓ కేసులు నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.

Jaya Prada: ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్!

సీనియర్ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ఆమె పాపులర్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి..జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలా సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ హోదాను జయప్రద అందుకున్నారు. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఇంకా చెప్పాలంటే.. ఆ తరం యువతకు జయప్రద ఒక రాణి. ఆమెను చూడటానికే థియేటర్లకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఆమె ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మిస్సింగ్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.

సీనియర్‌ నటి జయప్రద ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. అంతేకాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా కూడా గెలుపొందారు. ఆమె తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ యూపీలో సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి జయప్రద రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు.  2019 సార్వత్రిక ఎన్నికలకి ముందు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపేలో చేరారు జయప్రద. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే ఆమె తన ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాం ఖాన్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ప్రస్తుతం ఆమె బీజేపీ నేతగా ఉన్నారు. ఇక ఈమె స్టోరీ ఇలా ఉంటే.. జయప్రద మిస్సింగ్ అయ్యినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి జయప్రద కనిపించడం లేదు. ఆమె కోసం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆమె మీద రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో  కోర్టు సమన్లు జారీ చేసింది.

విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే విచారణకు హాజరు కావాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా జయప్రద పట్టించుకోలేదు.  దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. జనవరి 10న తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.  అంతేకాక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, జయప్రదని అరెస్ట్ చేయాలని రాంపూర్ కోర్టు యూపీ పోలీసులని ఆదేశించింది. దీంతో రాంపూర్ పోలీసులు ఆమెను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.  మరి.. ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.