iDreamPost
android-app
ios-app

ఇన్నాళ్లు ఇది ఎందుకు మిస్ అయ్యాను.. నటి ఇంద్రజ ఎమోషనల్!

  • Author ajaykrishna Published - 12:56 PM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 12:56 PM, Tue - 8 August 23
ఇన్నాళ్లు ఇది ఎందుకు మిస్ అయ్యాను.. నటి ఇంద్రజ ఎమోషనల్!

ఇండిపెండెన్స్ డే వస్తుందంటే.. బుల్లితెరపై రెగ్యులర్ గా సాగుతున్న ప్రోగ్రాంలన్నీ స్పెషల్ ఎపిసోడ్స్ తో అలరించేందుకు రెడీ అవుతుంటాయి. అందులో భాగంగానే పాపులర్ ఎంటర్టైన్మెంట్ షో.. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ తో సిద్ధం అయ్యింది. ఆ రోజుకు సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో ఎప్పటిలాగే యాంకర్ రష్మీ, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లతో పాటు జడ్జిగా నటి ఇంద్రజ కూడా కనిపించింది. అలాగే మిగతా సీరియల్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా బ్యూటీస్ కూడా తమ తమ స్కిట్స్, పెర్ఫార్మన్స్ లతో సందడి చేశారు.

ఈ క్రమంలో జడ్జిగా ఉన్న ఇంద్రజ ఓ సందర్బంలో చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలేం జరిగిందంటే.. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఇంద్రజ క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసింది. క్లాసికల్ డాన్స్ లో అనుభవం ఉన్న ఇంద్రజ.. చాలా ఏళ్ళ తర్వాత ఇలా క్లాసికల్ డాన్స్ చేసే అవకాశం వచ్చిందని చెబుతా భావోద్వేగానికి గురైంది. క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు ఎంతో ఆనందం పొందానని.. ఎందుకు ఇన్నాళ్లు మిస్ అయ్యానని ఆమె కంటతడి పెట్టుకొని.. ఏడ్చేసింది. ఆమె బాధపడటం చూసి యాంకర్ రష్మీ.. మిగతా వారు కూడా ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇండిపెండెన్స్ డే గురించి.. ఇంద్రజ పెర్ఫార్మన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.