iDreamPost

డ్రగ్స్ కేసులో  నటి హేమ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ కేసులో  నటి హేమ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!

సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయ్యారు. గత నెలలో బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొని, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. దాంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో రెండుసార్లు ఆమెకు నోటీసులు అందించినప్పటికీ.. పోలీస్ స్టేషన్ కు హాజరు కాకపోవడంతో.. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అనంతరం హేమను అనేకల్ లోని నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్ సీ కోర్టు జడ్జీ ముందు హాజరుపరచగా.. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయ్యారు. సోమవారం ఆమెకు మూడోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రెండు సార్లు నోటీసులు అందించినప్పటికీ ఆమె పలు కారణాలతో హాజరుకాలేదు. దాంతో  ఈసారి పక్కా ఆధారాలతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ముందు నుంచి హేమ తీరు విమర్శలకు దారితీస్తూనే ఉంది. తాను రేవు పార్టీలో పాల్గొనలేదని, చెబుతూ.. బిర్యానీ తిన్న పోస్ట్ లను షేర్ చేసి పోలీసులను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేసింది.

డ్రగ్స్ కేసులో తాజాగా అరెస్ట్ అయిన హేమకు విచారణ అనంతరం అనేకల్ లోని నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్ సీ కోర్టు జడ్జీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. ఈ విచారణ అనంతరం బయటకి వచ్చే ముందు మీడియాతో హేమ మాట్లాడారు. తాను రేవ్ పార్టీలో లేనని, బర్త్ డే కేక్ కట్ చేశాక వెంటనే హైదరాబాద్ వచ్చేశానని, సోషల్ మీడియాలో బిర్యానీ పోస్ట్ చేసింది తానేనని, ఇప్పటి వరకు తన బ్లడ్ శాంపిల్స్ సేకరించలేదని చెప్పుకొచ్చారు హేమ. కాగా.. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ 86 మంది మాదకద్రవ్యాలు వాడినట్లు పరీక్షల్లో తేలాయని నగర నేర నియంత్రణ దళం(సీసీబీ) అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి