iDreamPost
android-app
ios-app

మీరు అనుకునే రేవ్ పార్టీకి నేను వెళ్లాను! వీడియో రిలీజ్ చేసిన ప్రముఖ నటి!

Bangalore Rave Party.. బెంగళూరులో బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా. . స్థానిక పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించిన సంగతి విదితమే. ఇందులో తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఉన్నారని సమాచారం. ఈ పార్టీకి వెళ్లినట్లు ప్రముఖ నటి తెలిపింది.

Bangalore Rave Party.. బెంగళూరులో బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా. . స్థానిక పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించిన సంగతి విదితమే. ఇందులో తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఉన్నారని సమాచారం. ఈ పార్టీకి వెళ్లినట్లు ప్రముఖ నటి తెలిపింది.

మీరు అనుకునే రేవ్ పార్టీకి నేను వెళ్లాను! వీడియో రిలీజ్ చేసిన ప్రముఖ నటి!

కల్చర్.. ఎంత అడ్వాన్సుడ్‌గా ఉంటే.. అంత హైప్.. అడెక్టివ్. ముఖ్యంగా హైఫై పీపుల్, సెలబ్రిటీ, యూత్, పొలిటికల్ లీడర్స్.. నయా ట్రెండ్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. పబ్ కల్చర్ పోయి.. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది రేవ్ పార్టీ. ఇదొక గబ్బు కల్చర్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. తాజాగా బెంగళూరులో ఓ బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీని నిర్వహిస్తుండగా.. పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు రైడ్స్ చేయగా.. వంద మందికి పైగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పట్టుబడ్డారు. అందులో తెలుగు రాష్ట్రాల ప్రముఖులేనని తేలింది. ఇందులో నటి హేమ పేరు ప్రముఖంగా వినబడింది. అయితే తొలుత తాను ఆ పార్టీలో లేనని ఈ వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే ఓ వీడియో బైట్ చేసి బయటకు వదిలింది.

దీంతో ఆమె లేదని అనుకున్నారంతా. అంతలో పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీలో హేమ ఉందని నిర్దారించారు. అంతేకాకుండా ఆమె ఫోటో కూడా రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా హేమ కవరింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ లేపిన సంగతి విదితమే. కాగా, అరెస్టు జరిగిన సమయంలో కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వీటిల్లో ఓ వ్యక్తి ముసుగు వేసుకుని కనిపించగా.. కొంత మంది టాలీవుడ్ హీరో శ్రీకాంత్ అని, మరికొంత మంది జానీ మాస్టర్ అంటూ మాట్లాడారు. దీంతో శ్రీకాంత్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తనకు అలాంటి రేవ్ పార్టీ, పబ్ కల్చర్ అలవాటు లేదని చెప్పాడు. జానీ మాస్టర్ కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇదిలా ఉంటే.. ఇందులో మరో నటి కూడా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ యంగ్ నటి ఆషీరాయ్ కూడా ఈ పార్టీకి వెళ్లింది. పార్టీలో జరిగిన పరిణామాలపై ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. బిల్డర్, బుకీగా తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన వాసు అనే వ్యక్తి సన్ సెట్ టు సన్ రైజ్ కాన్సెప్టుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించాడు. అతడు పిలుపు మేరకు అక్కడకు వెళ్లినట్లు చెబుతుంది ఆషీ రాయ్. ‘వాసు పిలిస్తేనే అక్కడకు వెళ్లాను. నేను బర్త్ డే పార్టీ అని చెబితేనే వెళ్లాను. అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. పోలీసులు వచ్చినప్పుడు అక్కడే ఉన్నా. నేను వాసును అన్న పిలుస్తా. అతడు పిలిస్తేనే వెళ్లాను. కొకైన్, ఇతర మత్తు పదార్ధాలు దొరకడంపై నాకు సమాచారం తెలియదు. హేమను నేను చూడలేదు. లోపల ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అక్కడ పోలీసులకు నా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను’ అని తెలిపింది.

అందరి దగ్గర నుండి శాంపిల్స్ తీసుకుని వదిలేశారని తెలిపింది. అలాగే ఓ వీడియో కూడా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ‘నేను బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు నాకు తెలియదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడ పిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను’ అని వివరణ ఇచ్చింది. కాగా, ఆషీ రాయ్.. వైతరణి రాణా, లాక్ డౌన్, మిస్టరీ ఆఫ్ సారిక, కెఎస్ 100 వంటి చిత్రాల్లో నటించింది.