iDreamPost
android-app
ios-app

కోటి రూపాయలు పెట్టి కారు కొన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Feb 16, 2024 | 4:25 PM Updated Updated Feb 16, 2024 | 4:25 PM

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా.. కోటి రూపాయల విలువ చేసిన రేంజ్ రోవర్ న్యూ మోడల్ కారు కొన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా.. కోటి రూపాయల విలువ చేసిన రేంజ్ రోవర్ న్యూ మోడల్ కారు కొన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Feb 16, 2024 | 4:25 PMUpdated Feb 16, 2024 | 4:25 PM
కోటి రూపాయలు పెట్టి కారు కొన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

ఇండస్ట్రీలో కథ వేరు ఉంటది. రావడమే కష్టం ఒక్కసారి క్లిక్ అయితే.. వారి ఊహించిన జీవితం కళ్ల ముందు కదులాడుతూ ఉంటుంది. సినిమా హిట్ కొట్టిందా.. ఇక జీవితం సెట్టే, అదీ ఏ నటుడికైనా, నటికైనా. ఒక్కసారిగా నేమ్, ఫేమ్‌తో పాటు ఆశించిన దాని కన్నా రెమ్యునరేషన్ వస్తుంది. ఛాన్సులు మీద ఛాన్సులు రాగానే..వారి ఆర్థిక కష్టాలు తీరడమే కాకుండా లగ్జరీ ప్రపంచం పిలుస్తూ ఉంటుంది. ఇల్లు ఉండగానే చక్కదిద్దుకోవాలన్న సామెతను పాటిస్తూ ఉంటారు హీరో, హీరోయిన్లు. అందుకే అవకాశాలు ఉన్నప్పుడే.. ఆ డబ్బులతో పెట్టుబడులు పెడుతూనే.. ఖరీదైన కార్లు, బంగ్లా లేదా యాక్సరీస్ కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఓ నటి లగ్జరీ కారును కొని చర్చనీయాంశమైంది.

ఇంతకు ఆ నటి ఎవరంటే.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయిన మలయాళ భామ.. ఐశ్యర్య లక్ష్మి. ఇక కేరళ క్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్య వృత్తి నుండి మోడల్ రంగంలోకి అడుగుపెట్టి.. ఇటుగా పయనం అయ్యింది. మలయాళంలో మంచి హిట్స్ అందుకుంది. తెలుగులో గాడ్సే అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు..అమ్ము అనే ఓటీటీ ఫిల్మ్‌లో కూడా మెప్పించింది. ఇందులో సగటు ఇల్లాలిగా, భర్త చేతిలో తన్నులు తినే భార్యగా.. అతడికి బుద్ది చెప్పే తెగువ ఉన్న అమ్మాయి పాత్రలో కనిపించింది. అలాగే కుమారి అనే మలయాళ వెబ్ సిరీస్ ద్వారా కూడా అలరించింది అమ్మడు. కానీ ఆమెను ఎక్కువగా గుర్తు పట్టేది మాత్రం.. పొన్నియన్ సెల్వం, మట్టి కుస్తీ (తమిళంలో గట్టి కుస్తీ) వంటి పాపులర్ మూవీలతోనే.

ఇప్పుడు ఓ లగ్జరీయస్ కారును కొనుగోలు చేసి.. వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆ కారు ఏంటంటే రేంజ్ రోవర్ ఎవోక్ . 2024 న్యూ మోడల్ కారును ఐశ్వర్య లక్ష్మి కొనుగోలు చేసింది. అయితే ఈ విషయాన్ని ఎక్కడా వెళ్లడించలేదు కానీ.. ఆ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆ కార్ విలువ ఎంతో తెలుసా.. రూ. 70 లక్షల నుండి.. కోటి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారును ఆమె కేరళలో కొనుగోలు చేసింది. అక్కడ ఈ మోడల్ వెహికల్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఐశ్వర్యనే. కారు కొనడంతో ఆమెకు విషెస్ చేస్తున్నారు నెటిజన్లు. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి మరీ. డీజిల్, పెట్రోల్ దేనితోనైనా ఈ కారును నడుపుకోవచ్చు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి మణి రత్నం, కమల్ హాసన్ తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom