iDreamPost
android-app
ios-app

తమిళ హీరోయిన్ తో హీరో విశాల్ పెళ్లి! ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చేశాడు!

  • Author ajaykrishna Updated - 11:00 AM, Fri - 11 August 23
  • Author ajaykrishna Updated - 11:00 AM, Fri - 11 August 23
తమిళ హీరోయిన్ తో హీరో విశాల్ పెళ్లి! ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చేశాడు!

ఇండస్ట్రీలో ఎక్కువ కాలంగా బ్యాచిలర్స్ గా కంటిన్యూ అవుతున్న హీరోలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదొక వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అలా గత కొద్దిరోజులుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో హీరో విశాల్ పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్ తో కలిసి నటించిన తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పైగా విశాల్ – లక్ష్మీ మీనన్ ల ఫ్యామిలీస్ కూడా వీరి పెళ్లికి అంగీకారం తెలిపాయని.. కొన్నాళ్ళుగా వీరు ప్రేమలో ఉన్నారని కథనాలు చెబుతూ వచ్చాయి. దీంతో హీరో విశాల్ లేదా లక్ష్మీ ఎవరో ఒకరు ఈ వార్తలపై రియాక్ట్ అయి క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తెలిసేది.

ఈ క్రమంలో లక్ష్మీమీనన్ తో పెళ్లి వార్తలపై ఎట్టకేలకు విశాల్ క్లారిటీ ఇచ్చేశాడు. ట్విట్టర్ వేదికగా ఈ వార్తలపై స్పందించి.. అసలు విషయం చెప్పేశాడు. దీంతో ఇప్పుడు విశాల్ చేసిన ట్వీట్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అసలు విశాల్ ఏమని రియాక్ట్ అయ్యాడంటే.. ”జనరల్ గా నేను నా పెళ్లి గురించి వచ్చే పుకార్లను పెద్దగా పట్టించుకోను. పుకార్లు కదా అనవసరం అనుకుని వదిలేస్తాను. కానీ.. ఈసారి ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలని అనుకున్నాను. హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో నా పెళ్లి అని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. ఈ వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. లక్ష్మీ మీనన్ హీరోయిన్ కన్నా ముందు ఓ అమ్మాయిగా మీరు గ్రహించాలి. ఆమె పేరు ఇన్వాల్వ్ చేసి.. ఆమె పర్సనల్ లైఫ్, ఇమేజ్ దెబ్బతీసేలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకే నేను రియాక్ట్ అవుతున్నాను” అని క్లారిటీ ఇచ్చాడు.

అంతేగాక తన పెళ్లి ఎప్పుడనే విషయంపై కూడా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు విశాల్. ఇప్పటికి చాలాసార్లు ఈ విషయం చెప్పాడు. కానీ.. ఈసారి కొంచం అసహనంతో సమాధానం చెప్పాడని అనిపిస్తుంది. పెళ్లి గురించి స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేది అవసరం లేని టాపిక్. టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుంది. జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. ఇకనైనా మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికి భగవంతుడి ఆశీస్సులు’ అంటూ చెప్పాలనుకున్న మ్యాటర్ సూటిగా చెప్పేశాడు. దీంతో విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. అయితే.. విశాల్, లక్ష్మీ మీనన్ జంటగా పల్నాడు, ఇంద్రుడు సినిమాలు చేశారు. ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మరి విశాల్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss