iDreamPost
android-app
ios-app

ఆమె దేనికీ రావట్లేదు.. నయనతారపై హీరో విశాల్ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 08:13 AM, Sat - 29 July 23
  • Author ajaykrishna Published - 08:13 AM, Sat - 29 July 23
ఆమె దేనికీ రావట్లేదు.. నయనతారపై హీరో విశాల్ కామెంట్స్!

ఇండస్ట్రీలో తాము నటించిన సినిమాల ప్రమోషన్స్ కి అందరు హాజరైనా.. కొంతమంది హీరోలు, హీరోయిన్స్ రారు. వాళ్లు తమ సినిమాలను పెద్దగా ప్రమోట్ చేసుకోరు. స్టార్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. స్టార్డమ్ లో ఉన్న హీరోల సంగతి పక్కన పెడితే.. అందరి దృష్టి ఎప్పుడు హీరోయిన్స్ పైనే ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ సినిమాలే కాదు.. ఏం చేసినా వార్తల్లో నిలుస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా మీడియా నుండి మాత్రం తప్పించుకోలేరు. ఇప్పుడున్న సోషల్ మీడియా జోరుకి.. హీరోయిన్లే కాదు ఎవరైనా ఎందుకు రారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు సమాధానం చెప్పకతప్పదు. తాజాగా కోలీవుడ్ లో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశాల్ నయనతారపై కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు వాడే అయినప్పటికీ.. హీరోగా తమిళంలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హిట్స్ ప్లాప్స్ లెక్కచేయకుండా వరుసగా తనకు సూట్ అయ్యే సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విశాల్ హీరోగా ‘మార్క్ ఆంటోని’ అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రీతి వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్.జే. సూర్య విలన్ గా నటించాడు. అధిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ యాక్షన్ సినిమాలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది వినాయక చవితి సందర్బంగా రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల మార్క్ ఆంటోని ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు విశాల్. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో విశాల్ ని స్టార్ హీరోయిన్ నయనతార సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనట్లేదు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విశాల్ మాట్లాడుతూ.. “కొన్నాళ్ళుగా నయనతార ఏ చిత్ర ప్రమోషన్స్ లోను పాల్గొనడం లేదు. అది ఆమె పర్సనల్ ఛాయస్. ఖచ్చితంగా పాల్గొనాలని డిమాండ్ చేయలేం కదా. తనకు ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం. కానీ.. ఆమె ఇప్పటికైనా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుంది. తాము నటించిన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనడం తప్పేం కాదు” అని అన్నాడు. ప్రెజెంట్ విశాల్ మాటలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి విశాల్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet