iDreamPost
android-app
ios-app

జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి.. ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తున్న తెలుగు నటుడు!

  • Author ajaykrishna Updated - 07:35 PM, Mon - 30 October 23

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటుంటారు. కానీ.. జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ.. సినిమాల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చే ధైర్యం ఎంతమంది చేస్తారు. ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న వ్యక్తి అంత పనే చేశారు. జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి సినిమాల బాట పట్టారు. సక్సెస్ కూడా అయ్యారు. మరి ఆయన అసలు పేరు, జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటుంటారు. కానీ.. జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ.. సినిమాల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చే ధైర్యం ఎంతమంది చేస్తారు. ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న వ్యక్తి అంత పనే చేశారు. జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి సినిమాల బాట పట్టారు. సక్సెస్ కూడా అయ్యారు. మరి ఆయన అసలు పేరు, జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం!

  • Author ajaykrishna Updated - 07:35 PM, Mon - 30 October 23
జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి.. ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తున్న తెలుగు నటుడు!

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు సర్ప్రైజింగ్ స్టోరీస్ వింటుంటాం. స్టోరీస్ అంటే.. సినిమాలకు సంబంధించిన వి కాదు. సినిమా ఆర్టిస్ట్ లకు సంబంధించినవి. అవికూడా ఆశ్చర్యంతో పాటు ఇన్స్పైరింగ్ గా అనిపించేవి. అవును.. సినిమా ఆర్టిస్ట్ ల లైఫ్ లో కూడా మనల్ని మోటివేట్ చేసే కథలు ఉన్నాయా.. అనంటే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే.. కవర్ పేజీ చూసి బుక్ ని జడ్జి చేయొద్దు అన్నట్లుగా.. స్క్రీన్ పై కనిపించిన నటులను, వాళ్ళు పోషించిన క్యారెక్టర్స్ బట్టి.. వాళ్ళపై ఓ అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే.. వాళ్ళు సినిమా కోసం రంగు వేసుకున్న నటులు.. రియల్ లైఫ్ లో అంతా మనలాంటి వారే. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు భరించి.. ఈ స్టేజ్ కి వచ్చి ఉంటారని భావించాలి.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు, వ్యక్తిని మీరు చాలా సినిమాలలో చూసుంటారు. ఎందుకంటే.. ఇప్పటిదాకా ఆయన 70కి పైగా సినిమాలు చేశారు. సినిమాల మీద ఇష్టంతో.. ఏకంగా తనకున్న జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి.. ఇండస్ట్రీకి వచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు. సరే.. ఆయనకు ప్యాషన్ లేదనుకోండి. అయితేనేం.. తాను 23 ఏళ్ళ పాటు సర్వీస్ అందించిన గవర్నమెంట్ జాబ్ ని వదిలేసారు. అనంటే.. సినిమాలకు ఎంత ప్రిఫెరెన్సు ఇచ్చారో తెలుస్తుంది. కొంతమంది సినిమాపైనే ఇష్టంతో ముందునుండి ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతారు. ఇంకొందరు సినిమాలపై ఇంటరెస్ట్ లేకుండా.. అనుకోకుండానే వచ్చి సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పర్సన్.. ఒకే ఒక్క అవకాశంతో వచ్చారు.

ఆయన ఎవరో కాదు.. వడ్లమాని శ్రీనివాస్. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. ఓవైపు కామెడీ వేషాలు.. మరోవైపు కన్నింగ్ విలన్ రోల్స్.. ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. సినిమాల్లోకి రాకముందు శ్రీనివాస్.. విశాఖపట్నం జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా వర్క్ చేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు. ఆయన పూర్తి పేరు వడ్లమాని సత్య సాయి శ్రీనివాస్. చిన్నప్పటి నుండి బాగా చదివి.. జాయింట్ కలెక్టర్ అయ్యారు. అయితే.. సినిమాల్లోకి మాత్రం అనుకోకుండా వచ్చారట. ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో ఓ చిన్న వేషం ఇచ్చారట. ఆ వేషంతో డైరెక్టర్ మారుతీ మహానుభావుడులో ఛాన్స్ ఇచ్చారు.

అప్పటికి ఉద్యోగం చేస్తూనే.. గీతగోవిందం, ప్రతిరోజూ పండగే, ఎఫ్ 2.. లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. కట్ చేస్తే.. అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో జాయింట్ కలెక్టర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. పూర్తిగా సినిమాల వైపు వచ్చేసారు. అయితే.. ఆ ఉద్యోగం వల్ల తనకు దర్శకులతో మంచి పరిచయం.. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఒక మార్గం అయితే దొరికిందని చెబుతున్నారు శ్రీనివాస్. ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారని.. ఏడాదికి రూ. కోటి వరకు సంపాదించే స్థాయికి ఎదిగినట్లు ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం పాతిక సినిమాల వరకు లైన్ లో ఉన్నాయట. త్వరలోనే వంద సినిమాలు పూర్తి అవుతాయని అన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ గా పొందిన రెస్పెక్ట్ మాత్రం ఇండస్ట్రీలో రాదని చెప్పారు శ్రీనివాస్. ప్రస్తుతం ఈయన గురించి ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి వడ్లమాని శ్రీనివాస్ గురించి మీరేమంటారు? కామెంట్స్ లో తెలపండి.