iDreamPost
android-app
ios-app

రోలెక్స్ గురించి అపోహలు! ఒక్క ముక్కతో క్లారిటీ ఇచ్చిన సూర్య!

  • Author ajaykrishna Published - 04:51 PM, Mon - 14 August 23
  • Author ajaykrishna Published - 04:51 PM, Mon - 14 August 23
రోలెక్స్ గురించి అపోహలు! ఒక్క ముక్కతో క్లారిటీ ఇచ్చిన సూర్య!

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ లో చాలామంది స్టార్స్ కి సాలిడ్ క్యారెక్టర్స్ పడిన సంగతి తెలిసిందే. ఖైదీ.. విక్రమ్ సినిమాలతో మొదలైన ఈ యూనివర్స్ లో దిల్లీగా కార్తీ.. విక్రమ్ గా కమల్ హాసన్.. రోలెక్స్ గా సూర్య ఉన్నారు. వీళ్ళకి సపోర్టింగ్ గా నరైన్, ఫాహద్ ఫాజిల్, ఏజెంట్ టీనా ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే.. ఖైదీలో దిల్లీగా నటించిన కార్తీ.. ఆ తర్వాత విక్రమ్ లో కేవలం వాయిస్ తో సర్ప్రైజ్ చేశాడు. ఎలాగో విక్రమ్ లో కమల్ క్యారెక్టర్ టోటల్ గా క్రేజీ అనిపించుకుంది. కానీ.. విక్రమ్ చివరిలో వచ్చిన రోలెక్స్ క్యారెక్టర్ మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అంటే.. నెక్స్ట్ పార్ట్స్ కి లీడ్ ఇవ్వడమే కాకుండా.. లోకి యూనివర్స్ కి మరింత క్రేజ్ తెచ్చింది రోలెక్స్ పాత్ర.

అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ లోకి రోలెక్స్ ఎలా ఎంటర్ అయ్యాడు? ఇన్నాళ్లు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నిర్మించుకున్న సామ్రాజ్యం అని అన్నాడు.. అంటే విక్రమ్ లైఫ్ లో ముందునుండి రోలెక్స్ పాత్ర ట్రావెల్ అవుతుందా? లేదా అనుకోకుండా విక్రమ్ వరల్డ్ లోకి రోలెక్స్ వచ్చాడా.. అసలు విక్రమే రోలెక్స్ వరల్డ్ లో దిగాడా? అంటూ ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. వీటన్నిటికీ సమాధానం ఒక్కో పార్ట్ లో క్లియర్ చేసుకుంటూ వస్తానని డైరెక్టర్ లోకేష్ తెలిపాడు. కానీ.. ఒక్కసారి మైండ్ లోకి ఓ క్యారెక్టర్ లోతుగా దిగిపోయాక.. దాని గురించి తెలుసుకోకుండా ఉండలేం. ఎప్పటికప్పుడు దానిపై అప్డేట్స్ కావాలని అనిపిస్తుంది.

ప్రస్తుతం రోలెక్స్ విషయంలో ఫ్యాన్స్ కి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అంటే.. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ప్రేక్షకులలో.. ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. విక్రమ్ రిలీజ్ అయినప్పుడే లోకేష్.. ఖైదీ 2, విక్రమ్ 2 లతో పాటు రోలెక్స్ క్యారెక్టర్ పై సపరేట్ సినిమా ఉంటుందని చెప్పి మైండ్ బ్లాక్ చేశాడు. అయితే.. దాదాపు ఏడాదిగా రోలెక్స్ క్యారెక్టర్ గురించి ఊసు లేదు. దీంతో రీసెంట్ గా ఫ్యాన్స్ తో మీట్ లో పాల్గొన్న సూర్య.. రోలెక్స్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. అదేంటంటే.. రోలెక్స్ క్యారెక్టర్ బేస్ చేసుకొని డైరెక్టర్ లోకేష్ ఓ స్టోరీ చెప్పాడు. అది నాకు నచ్చింది. ఖచ్చితంగా రోలెక్స్ క్యారెక్టర్ పై ఓ సినిమా మా కాంబినేషన్ లో ఉండబోతుందని చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం రోలెక్స్ మూవీపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్లే. ప్రెజెంట్ లోకేష్ లియోపై వర్క్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూర్య కంగువ, వాడివాసల్ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ తో రోలెక్స్ తెరకెక్కనుంది. అప్పటిదాకా వెయిట్ చేయకతప్పదు. మరి రోలెక్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss