బంగ్లాదేశ్ లో హిందూ మహిళా ఆవేదన పై.. స్పందించిన సోనూ సూద్

బంగ్లాదేశ్ లో హిందూ మహిళా ఆవేదన పై.. స్పందించిన సోనూ సూద్

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లకు తాజాగా ఆ దేశంలోని వలసకు వెళ్లిన హిందూ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో దీనినిన చూసిన స్టార్ నటుడు సోనూ సూద్ తాజాగా స్పందించారు. అంతేకాకుండా.. ఈ విషయంపై కీలక ప్రకటన చేశఆరు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లకు తాజాగా ఆ దేశంలోని వలసకు వెళ్లిన హిందూ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో దీనినిన చూసిన స్టార్ నటుడు సోనూ సూద్ తాజాగా స్పందించారు. అంతేకాకుండా.. ఈ విషయంపై కీలక ప్రకటన చేశఆరు.

బంగ్లాదేశ్ లోని గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అంశంపై.. ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం ప్రయత్నించడం చేశారు. ఇక ఈ అంశం పై అక్కడ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర నిరసనలకు దిగారు. ఇక ఆ నిరసనలు కాస్త చిలికి చిలికి గాలి వానగా మారడంతో.. ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయేలా చేశాయి. కాగా, ఈ హింసాత్మక అల్లర్లు వలన బంగ్లాదేశ్ లో రావణకాష్టంగా మారాయి.

ఇప్పటికే అక్కడ అల్లర్లు వలన 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని జరుగుతున్న ఈ అల్లర్లుకు వలస వెళ్లిన హిందువుల పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బంగ్లాదేశ్ లోని హిందువుల మారణహోమం ఎలా జరుగుతుందో, ఎంతటి ప్రభావం చూపుతుందో ఓ బంగ్లాదేశ్ హిందూ మహిళ వీడియో ద్వారా పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో పై తాజాగా ప్రముఖ స్టార్ హీరో సోనూ సూద్ స్పందించి కీలక ప్రకటన చేశారు.

తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన హిందూ మహిళ  ఆ వీడియోలో  తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను  కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ కోరింది. ఇక  ఈ వీడియో  కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే ఈ వీడియో స్టార్ నటుడు సోనూ సూద్ కంట పడటంతో.. దానిని చూసిన  చలించుకుపోయాడు. వెంటనే ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తే ఓ ట్వీట్ చేశాడు.  ఇక ఆ ట్వీట్ లో సోనూ సూద్.. ”బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు.

అయితే ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్” అని రాసుకొచ్చాడు. ఇక సోనూ సూద్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వెంటనే బంగ్లాదేశ్  లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశంలో ప్రముఖలతో పాటు ప్రతిఒక్కరు స్పందించాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా.. బంగ్లాదేశ్ మహిళ ఆవేదనపై స్పందించిన సోనూ సూద్ ను ప్రశంసిస్తున్నారు.

Show comments