P Krishna
Simbu Comments Red Card: తమిళ సంచలన హీరోగా పేరు తెచ్చుకున్నాడు శింబు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. నటుడిగానే కాకుండా మల్టీటాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
Simbu Comments Red Card: తమిళ సంచలన హీరోగా పేరు తెచ్చుకున్నాడు శింబు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. నటుడిగానే కాకుండా మల్టీటాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
P Krishna
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, దర్శక, నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ ఇలా ఎంతోమంది ఉన్నారు. తమిళనాట కమల్ హాసన్, శింబు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు టి.రాజేందర్ తనయుడు శింబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. నటుడిగా ఎంత క్రేజ్ ఉందో వివాదాల్లో అంతకు మించి అన్నట్లుగా శింబు ప్రస్థానం సాగుతుంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి సంబంధించిన వార్తల్లో నిలుస్తుంటారు హీరో శింబు. తాజాగా శింబు కి సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తమిళ ఇండస్ట్రీలో సంచలనాలక కేరాఫ్ అడ్రస్ గా ఉండే హీరో శింబు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు.బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన శింబు తర్వాత తన తండ్రి టి రాజేందర్ దర్శకత్వంలో ‘కాదల్ అళివాతిల్లై’ మూవీతో హీరోగా మారాడు. ఈ చిత్రం 2002 లో రిలీజ్ అయి మంచి టాక్ గెచ్చుకుంది. శింబు హీరోగానే కాదు.. నిర్మాత, స్క్రీన్ ప్లే, సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా నిర్మాత ఐసరి గణేశ్.. శింబు పై ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి నిర్మాత ఐసరి గణేశ్ మాట్లాడుతూ.. ‘కరోనా కుమార్’ మూవీలో శింబు నటించేందుకు ఒప్పుకున్నాడు. ఇందుకోసం రూ.4 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు.కానీ తన మూవీలో నటించకుండా ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ లో నటిస్తున్నాడని.. ఆ మూవీలో నటించకుండా నిషేదించాలని ఫిర్మాదు చేసినట్లు నిర్మాత తెలిపారు.
ఈ విషయంపై శింబు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో నాపై విచిత్రమైన రూమర్ పుట్టుకు వస్తుంది. ఇండస్ట్రీలో నాపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం జరుగుతుంది. నేను కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ పుకార్లు ఎలా పుట్టుకు వస్తాయో అస్సలు అర్థం కాదు.. మరీ నా విషయంలో ఇలాంటి పుకార్లు భలే పుట్టుకు వస్తాయి. నాపై రెడ్ కార్డు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఒక చిన్న సిమస్య ఉంది.. దాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవొద్దు’ అని అన్నారు.