iDreamPost
android-app
ios-app

ఫేవరేట్ హీరో ప్రశంసలు! గాల్లో తేలిపోతున్న ‘బేబీ’ హీరోయిన్!

  • Author ajaykrishna Published - 11:13 AM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 11:13 AM, Wed - 26 July 23
ఫేవరేట్ హీరో ప్రశంసలు! గాల్లో తేలిపోతున్న ‘బేబీ’ హీరోయిన్!

ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన హీరోహీరోయిన్స్ కి తమ ఫస్ట్ మూవీ గురించి.. అభిమాన హీరో మాట్లాడితే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అదే ఫేవరేట్ హీరో స్వయంగా విష్ చేస్తూ.. గిఫ్ట్ పంపిస్తే అంతకన్నా వేరే ఏముంటుంది. ఖచ్చితంగా ఎవరైనా గాల్లో తేలిపోవాల్సిందే. అయితే.. ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. అలాగని చేసిన సినిమా సక్సెస్ అవుతుందని పక్కాగా అంచనా వేయలేరు. ఎందుకంటే.. సినిమాలు ఎలా తీసినా హిట్ అవుతుందా లేదా అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. కానీ.. కొన్ని సినిమాలే ముందునుండి సక్సెస్ అవుతాయనే ఒక వైబ్ ని క్రియేట్ చేస్తాయి. అలాంటి వాటిలో రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’.

ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డెబ్యూ చేసిన మూవీ ఇది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించారు. రిలీజ్ కి ముందే సాంగ్స్, టీజర్ ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాగో ముందే ఒక ట్రాజిక్ లవ్ స్టోరీగా ట్రైలర్ చూస్తే తెలిసింది. కానీ.. ఖచ్చితంగా హిట్ అవుతుందనే వైబ్ అయితే అందరిలోనూ కల్పించారు. కట్ చేస్తే.. రిలీజ్ అయ్యాక సినిమా బ్లాక్ బస్టర్. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న బేబీ.. రెండో వారం కూడా విజయవంతంగా థియేటర్స్ లో రన్ అవుతోంది. వెరసి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసింది.

ఇదిలా ఉండగా.. ముందు చెప్పినట్లు ఫేవరేట్ హీరో నుండి కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ కి విషెష్ వస్తే.. ఆ ఆనందం చెప్పుకోలేనిది. ప్రస్తుతం బేబీ మూవీతో డెబ్యూ చేసిన వైష్ణవి చైతన్య.. అలాంటి ఆనందంలోనే మునిగితేలుతోంది. బేబీ సినిమా చూసిన తన ఫేవరేట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని.. వైష్ణవిని అభినందిస్తూ విష్ చేశాడు. అంతేగాక ఏకంగా ఓ అందమైన పూల బొకే కూడా గిఫ్ట్ గా పంపించాడు. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘బేబీ టీమ్ ని ప్రశంసిస్తూ బొకే పంపినందుకు థాంక్యూ రామ్ గారు’ అని ఫోటోలు పోస్ట్ చేసింది. తన ఫేవరేట్ హీరో రామ్ అని ఇదివరకే వైష్ణవి ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా తన నుండి ఫ్లవర్స్ వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బవుతోంది. మరి బేబీ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss