iDreamPost
android-app
ios-app

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్ ను మలయాళంలో తీయాలనుకుంటున్నా: నాని

Actor Nani Comments On Game Of Thrones: సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చిలో నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళంలో ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నాని తెలిపాడు.

Actor Nani Comments On Game Of Thrones: సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చిలో నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళంలో ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నాని తెలిపాడు.

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్ ను మలయాళంలో తీయాలనుకుంటున్నా: నాని

ప్రతి ఒక్కరి ఏదో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసినప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే వాటిని పదే పదే చూస్తుంటారు. అలా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కొన్ని మూవీలు, వెబ్ సిరీస్ లకు ఫిదా అవుతుంటారు. వీలుంటే.. అలాంటి సూపర్ హిట్ సినిమాలు,వెబ్ సిరీస్ లో తాము కూడా నటించాలని భావిస్తుంటారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా ఓ వెబ్ సిరీస్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెప్పించిన ఆ వెబ్ సిరీస్ ను మలయాళంలో తీయాలని అనుకుంటున్నట్లు నాని తెలిపాడు. త్వరలో రిలీజ్ కానున్న తన మూవీ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చిలో మీడియాతో మాట్లాడాడు.

సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చిలో నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మలయాళంలో ఎప్పుడైనా ఏదైనా నిర్మించే అవకాశం వస్తే..తాను మొదట చేసేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని నాని స్పష్టం చేశాడు.  మిగత ఇండస్ట్రీలతో పోలీస్తే మలయాళంలో ఈ వెబ్ సిరీస్ ను తీయం చాలా ఈజీ అని నాని అన్నారు.   అక్కడి ఏ నిర్మాతైనా సులువుగా ఎంతో ప్రతిభ ఉన్న యాక్టర్స్ ను ఒక్కచోట చేర్చగలడని నాని అభిప్రాయపడ్డాడు. ప్రతి పాత్రకు సముచిత న్యాయం, బలమైన స్క్రీన్ ప్లే ఉన్నా కూడా టాలీవుడ్ లేదా కోలీవుడ్ లో అలాంటి నటీనటులను ఒక్కచోట చేర్చడం కష్టమని నాని  అభిప్రాయ పడ్డాడు. మాలీవుడ్ మూవీస్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆవేశం, భీష్మ పర్వం, ప్రేమలు, ఆడుజీవితంలాంటి సినిమాల్లోని యాక్టర్స్ నటన అద్భతమని కొనియాడాడు.

ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ ను ప్రపంచం మొత్తం మెచ్చింది. రికార్డు స్థాయిలో ఈ వెబ్ సిరీస్ కి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ను హెచ్ బీఓ సంస్థ నిర్మించింది. ఇద అమెరికన్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్ కాగా.. దీనిని డేవిడ్ బెనియోఫ్, డీబీ వీస్ రూపొందించారు.  జార్జ్ ఆర్ఆర్  మార్టిన్ రాసిన ఫాంటసీ నవలల సిరీస్ లోని తొలి భాగమే  ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్  మొత్తం ఎనిమిది సీజనల్ లో 73 ఏపిసోడ్ లో ప్రాసరం చేయబడ్డాయి. ఈ సిరీస్ 2011 ఏప్రిల్ 17న ప్రారంభమై 2019మే19న ముగిసింది.ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుడటంతో ప్రమోషన్లలో నాని పాల్గొంటున్నాడు. ఈ  నేపథ్యంలోనే మలయాళం వెర్షన్ ప్రమోషన్ల కోసం కొచ్చి వెళ్లాడు.