iDreamPost
android-app
ios-app

శ్రీదేవితో నాకు పెళ్లి చేయాలనుకున్నారు! మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Author Soma Sekhar Published - 06:28 PM, Thu - 22 June 23
  • Author Soma Sekhar Published - 06:28 PM, Thu - 22 June 23
శ్రీదేవితో నాకు పెళ్లి చేయాలనుకున్నారు! మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మురళీ మోహన్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డీసెంట్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తన సుదీర్ఘ సిని ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి, కుటుంబ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారు మురళీ మోహన్. తాజాగ ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శ్రీదేవి వాళ్ల అమ్మ అబ్బాయి బాగున్నాడు.. ఇలాంటి వాడినే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పినట్లు మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

మురళీ మోహన్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కుటుంబ చిత్రాల హీరోగా 80, 90 దశకాల్లో అగ్రహీరోగా వెలుగొందారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా సుదీర్ఘ సినీ కెరీర్ ను కొనసాగించారు మురళీ మోహన్. సినిమాల్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారాయన. రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేశారు. దాంతో క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు. వయసు మీద పడుతుండటంతో సినిమాలు తగ్గించారు. చాలా రోజుల తర్వాత ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. దానికి ప్రధాన కారణం.. శ్రీదేవితో నాకు పెళ్లి చేయాలనుకున్నారు అని చెప్పడమే. మురళీ మోహన్ ను చూసిన శ్రీదేవి వాళ్ల అమ్మ.. అబ్బాయి బాగున్నాడు, మన అమ్మాయికి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అని ఆమె చెప్పినట్లు ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో నేను శ్రీరామ చంద్రుడిని అని ఏఎన్ఆర్ కితాబిచ్చినట్లు తెలిపారు. మురళీ మోహన్ నిర్మాతగా మారి కొన్ని చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet