P Krishna
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్త దానం ఎంతో అవసరం. అందుకే 1998 అక్టోబర్ 2న ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్త దానం ఎంతో అవసరం. అందుకే 1998 అక్టోబర్ 2న ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఒక నటుడిగానే కాకుండా సామాజిక సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. 26 ఏళ్లుగా ఈ బ్లెడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. బ్లెడ్ బ్యాంక్ స్థాపకులు చిరంజీవికి ఎల్లవేలల అండగా నిలుస్తుంది ఆయన అభిమానులు మాత్రమే. ప్రతి సంవత్సరం బ్లెడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే రక్తదాన శిభిరంలో వేల మంది పాల్గొంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న లక్షలాది మంది రక్తదాతల్లో ప్రముఖ నటుడు మహర్షి ఒకరు. తాజాగా ఆయన చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో ‘మహర్షి’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహర్షి రాఘవ. వెండితెరపైనే కాదు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటు వస్తున్నారు. తాజాగా మహర్షి రాఘవ మరోసారి వార్తల్లో నిలిచారు. నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి సమాజ సేవలో భాగంగా 1998 అక్టోబర్ 2న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఆ సమయంలో రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్. రెండవ వ్యక్తి మహర్షి రాఘవ. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొదలు పెట్టినప్పటి నుంచి మహర్షి రాఘవ ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచారు.
గతంలో మహర్షి రాఘవ 100వ సారి రక్తదానం చేస్తే నిన్ను కలవడానికి తప్పకుండా వస్తానని చిరంజీవి మాట ఇచ్చారు. అయితే రాఘవ 100వ సారి రక్తదానం చేసే సమయానికి చిరంజీవి చెన్నైలో ఉండటంతో రాలేకపోయారు. మహర్షి రాఘవ వందవ సారి రక్తదానం చేసిన విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అని.. అలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రప్రధమంగా నిలిచారని ఆయనను అభినందించారు. ఆ సందర్భంగా మొదటి సారి రక్తదానం చేసిన మురళీ మోహన్ కూడా అక్కడే ఉన్నారు.