బ్రేకింగ్: దుండగుల కాల్పుల్లో ప్రముఖ నటుడు కన్నుమూత!

Johnny Wactor Passed away: అమెరికాలో కొంత కాలంగా గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఓ వైపు ఉగ్రవాదుల దాడులు.. మరోవైపు ఉన్మాదుల కాల్పుల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Johnny Wactor Passed away: అమెరికాలో కొంత కాలంగా గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఓ వైపు ఉగ్రవాదుల దాడులు.. మరోవైపు ఉన్మాదుల కాల్పుల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటీవల అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. మైనర్లు సైతం ఇక్కడ గన్స్ వాడుతున్నారు. చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు సైతం గన్స్ తో బెదిరించడం.. కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల అమెరికాలో కొంతమంది ఉన్మాదులు స్కూల్స్, మాల్స్, హాస్పిటల్స్, ప్రార్థనా స్థలాలు, పార్కులు, హూటల్స్ వద్ద విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు. ఓ వైపు ఉగ్రవాదులు, మరోవైపు ఉన్మాధులు రెచ్చిపోతూ అమాయకులు ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ వాక్టర్ (37) దుండగుల కాల్పుల్లో కన్నుమూశాడు. శనివారం ఉదయం లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ లో ఈ దారుణ ఘటన జరిగినట్లు జానీ వాక్టర్ తల్లి స్కార్లెట్ మీడియాకు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ముగ్గురు వ్యక్తులు వాక్టర్ కారు వద్దకు వచ్చి కాటలిక్ట్ కన్వర్టర్ ని దొంగిలించే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలోనే వాక్టర్ కి దుండగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో దుండగులు కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ని హాస్పిటల్ లో చేర్పించాం… చికిత్స పొందుతూ కన్నుమూశాడు’. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల వేటలో ఉన్నారు.

జానీ వాక్టర్ ప్రస్తుతం తల్లి స్కార్లెట్, లాన్స్, గ్రాంట్ అనే ఇద్దరు సోదరులతో కలిసి ఉంటున్నాడు. కెరీర్ విషయానికి వస్తే.. 2007 లో వచ్చిన లైఫ్ టైమ్ డ్రామా సీరీస్, ఆర్మీ వైవ్స్ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వెస్ట్ వరల్డ్, ది ఓ, ఎన్ సీ ఐ ఎస్, స్టేషన్ 19, క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్ లాంటి సీరీస్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న జానీ వాక్టర్ అర్ధాంతరంగా కన్నుమూయడంతో హాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.. పలువురు ఆయనకు ఘన నివాళులుర్పిస్తున్నారు.

Show comments