iDreamPost
android-app
ios-app

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో పూరీ, ఛార్మీ ఎక్కడ? అసలు నిజం ఏంటి?

  • Published Aug 07, 2024 | 1:49 PM Updated Updated Aug 07, 2024 | 1:49 PM

డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. కానీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీలు ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే?

డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. కానీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీలు ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే?

  • Published Aug 07, 2024 | 1:49 PMUpdated Aug 07, 2024 | 1:49 PM
Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో పూరీ, ఛార్మీ ఎక్కడ? అసలు నిజం ఏంటి?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ తెరకెక్కిన మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. 2019లో వచ్చి, బ్లాక్ బస్టర్ హిక్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. దాంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా  ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పుల్ లెంత్ మాస్ యాక్షన్ తో, పూరీ తన మార్క్ టేకింగ్ తో సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్లలో కూడా వేగం పెంచింది. అయితే.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి పూరీ, ఛార్మీ రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.

డబుల్ ఇస్మార్ట్.. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ రాకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అదీకాక విడుదలకు వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. కానీ ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు అటు పూరీ గానీ, ఇటు ఛార్మీ గానీ ఎక్కడా కనిపించలేదు. వీరిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడానికి అసలు నిజం ఏంటా అని ఆరా తీయగా.. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Double Ismart

పూరీ జగన్నాథ్ ఫైనల్ మిక్సింగ్, సెన్సార్ కోసం ముంబైలో ఉన్నానని, అందుకే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఛార్మీ సైతం అక్కడే ఉండి పనులు చక్కబెతున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజులే సమయం ఉండటంతో ఫైనల్ వెర్షన్ ను రెడీ చేసేందుకు కష్టపడుతున్నాడు డాషింగ్ డైరెక్టర్. ఈ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్ కు రాలేకపోతున్నాడు. దీంతో పాటుగా రామ్ కు పూరీకి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే పూరీ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నాడని కొందరు చెప్పుకొస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా.. పూరీ ఒక్కసారి ప్రమోషన్లలోకి దిగితే.. డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఇంకా హైప్ పెరుగుతుంది. పూరీ తన మార్క్ స్పీచ్ లతో, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేయగలడు. పైగా ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలతో సినిమా ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లగలడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా డాషింగ్  డైరెక్టర్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss