iDreamPost
android-app
ios-app

వివాదంలో రజినీకాంత్ ‘జైలర్’ టైటిల్! కోర్టును ఆశ్రయించిన నిర్మాత!

  • Author ajaykrishna Updated - 01:51 PM, Mon - 17 July 23
  • Author ajaykrishna Updated - 01:51 PM, Mon - 17 July 23
వివాదంలో రజినీకాంత్ ‘జైలర్’ టైటిల్! కోర్టును ఆశ్రయించిన నిర్మాత!

ఒక్కోసారి సినిమాలు, సన్నివేశాలు మాత్రమే కాదు.. సినిమా టైటిల్స్ కూడా వివాదాలకు దారి తీస్తుంటాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అలాంటిదే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన సినిమాకి జరిగింది. రజినీ నటించిన కొత్త సినిమా ‘జైలర్’. డాక్టర్, బీస్ట్ సినిమాల డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న జైలర్ మూవీ.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇటీవల విడుదల చేసిన ‘కావాలా’ అనే సాంగ్ ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా.. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ లాంటి హేమహేమీలు నటించారు.

మొత్తానికి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా కొద్దిరోజులు ఉండగానే.. సాంగ్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇంతలో సినిమా టైటిల్ గురించి చట్టపరమైన వివాదం నెలకొంది. జైలర్ టైటిల్ వల్ల తమ సినిమా నష్టపోతుందని మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడీ జైలర్ మూవీ టైటిల్.. కోర్టు చిక్కుల్లో చిక్కుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి అసలు జైలర్ వివాదం ఏంటి? అసలు మలయాళం నిర్మాతకి.. జైలర్ కి ఏంటి సంబంధం అనే వివరాల్లోకి వెళ్దాం.

మలయాళంలో ప్రొడ్యూసర్ ఎన్.కే. మొహమ్మద్ నిర్మించిన పీరియడికల్ డ్రామా ‘జైలర్’. దీనికి దర్శకుడు సక్కిర్. అయితే.. ఈ సినిమా కూడా సూపర్ స్టార్ రజినీ నటించిన జైలర్ తో పాటే రిలీజ్ కాబోతుంది. దీంతో ఒకేసారి ఒకే టైటిల్ తో రెండు సినిమాలు విడుదలైతే.. ఆడియన్స్ కన్ఫ్యూషన్ కి గురవుతారని మలయాళ నిర్మాత, దర్శకుడు టెన్షన్ పడుతున్నారు. అసలే నష్టాలలో ఉన్నాం. పైగా మాది చిన్న సినిమా. మేం మరింత నష్టాలలో మునిగిపోతాం.. అని ప్రొడ్యూసర్ కోర్టును ఆశ్రయించాడట. రజినీ జైలర్ నిర్మించిన సన్ పిక్చర్స్ వారు.. కనీసం కేరళ వరకైనా టైటిల్ మార్చుకోమని సంప్రదించినా.. అంగీకరించట్లేదు అని మలయాళం నిర్మాత వాదన. మరి సన్ పిక్చర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ.. మలయాళంలో టైటిల్ మార్చుతుందా? రజినీ సినిమా టైటిల్ చేంజ్ అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏం జరుగుతుందో. చూడాలి. మరి జైలర్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet