iDreamPost
android-app
ios-app

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి! ఓ ఇంటివాడు కాబోతున్న రానా తమ్ముడు!

  • Author ajaykrishna Updated - 12:13 PM, Fri - 18 August 23
  • Author ajaykrishna Updated - 12:13 PM, Fri - 18 August 23
దగ్గుబాటి వారింట పెళ్లి సందడి! ఓ ఇంటివాడు కాబోతున్న రానా తమ్ముడు!

తెలుగు ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న గౌరవం వేరు. లెజెండరీ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ద్వారా ఆయన తనయులు నిర్మాత సురేష్ బాబు, హీరో విక్టరీ వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇండస్ట్రీలో దశాబ్దాలుగా దగ్గుబాటి వారి సినీ ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. అయితే.. సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. రెండేళ్ల క్రితమే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రానా. ఇప్పుడు రానా తమ్ముడు, సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అభిరామ్ ఇటీవల అహింస సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు.

మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. తదుపరి సినిమాలకు సిద్ధం అవుతున్నాడట. ఈ క్రమంలో ఇప్పుడు లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరి లైఫ్ లో అయినా పెళ్లి అనేది చాలా స్పెషల్ మూమెంట్. త్వరలోనే అభిరామ్.. వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నాడట. అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చుట్టాలమ్మాయే అని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్ బాబు కూతురు.. కూతురినే అభిరామ్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే మాటామంతి కూడా అయ్యిందట. త్వరలో ఎంగేజ్మెంట్ చేసి.. పెళ్లి డేట్ ఫిక్స్ చేయబోతున్నారని టాక్.

ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎటువంటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రి రామానాయుడు నుండి ఆయన వారసులుగా సురేష్ బాబు, వెంకటేష్ లు.. దగ్గుబాటి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే రానా.. అభిరామ్ అడుగులు వేస్తున్నారు. కాగా.. కొన్నేళ్ల క్రితం అభిరామ్.. పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఆరోపణలు ఫేస్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ తేజతో అహింస సినిమా చేసి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద అహింస సినిమా నిరాశపరిచింది. దీంతో తదుపరి సినిమాలకు జాగ్రత్తగా స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş