iDreamPost
android-app
ios-app

రీ ఎంట్రీకి సిద్ధమైన ఆమీర్ ఖాన్! ఆ మూవీతోనేనా?

  • Author Soma Sekhar Published - 07:26 PM, Tue - 29 August 23
  • Author Soma Sekhar Published - 07:26 PM, Tue - 29 August 23
రీ ఎంట్రీకి సిద్ధమైన ఆమీర్ ఖాన్! ఆ మూవీతోనేనా?

ఆమీర్ ఖాన్.. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విలక్షణమైన నటనతో, కథల ఎంపికతో బాలీవుడ్ లో ముందుకు సాగే హీరోల్లో ఆమీర్ ఖాన్ ముందువరుసలో ఉంటాడు. అయితే ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ నుంచి సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తోంది. ఆమీర్ నటించిన చివరి మూవీ ‘లాల్ సింగ్ చద్దా’. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో.. సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. ఈ టైమ్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజయ్ చేస్తున్నాడు ఆమీర్. తాజాగా ఆమీర్ తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించడానికి సిద్దమైనట్లు సమాచారం.

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. లాల్ సింగ్ చద్దా మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే మధ్యలో ‘సలాం వెంకీ’ మూవీలో గెస్ట్ రోల్ చేశాడు. కాగా.. ఈ బ్రేక్ తర్వాత తన నెక్ట్స్ మూవీని ప్రారంభించాడట ఆమీర్. తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. తరుణ్ ఆదర్శ్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.”ఆమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 16 సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ మూవీలో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్.

కాగా.. మూవీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మెుదలైయ్యాయి. 2024 జనవరి 20 నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు” అంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని పేర్కొన్నాడు. దీంతో ఆమీర్ రీ ఎంట్రీకి సిద్దమైయ్యాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరికొంతమంది మాత్రం 3 ఇడియట్స్ మూవీకి సీక్వెల్ తో ఆమీర్ ఖాన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమీర్ ఖాన్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş