iDreamPost

సక్సెస్ కోసం రాజ్ తరుణ్ ప్రయత్నాలు! ఈసారి కొట్టేలా ఉన్నాడు!

  • Author singhj Published - 06:30 PM, Tue - 29 August 23
  • Author singhj Published - 06:30 PM, Tue - 29 August 23
సక్సెస్ కోసం రాజ్ తరుణ్ ప్రయత్నాలు! ఈసారి కొట్టేలా ఉన్నాడు!

యంగ్ హీరో రాజ్ తరుణ్​ సరైన హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఈ హీరో వరుస సక్సెస్​లు అందుకున్నారు. ‘ఉయ్యాల జంపాల’తో పాటు ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ రూపంలో హ్యాట్రిక్ హిట్స్​తో బాక్సాఫీస్​ను షేక్ చేశారు రాజ్ తరుణ్. వినూత్న కథలతో పాటు హాస్యరస ప్రేమ కథా చిత్రాలు చేస్తూ యూత్ ఆడియెన్స్​లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. రాజ్ తరుణ్ మూవీకి వెళ్తే మినిమం ఎంటర్​టైన్​మెంట్ ఉంటుందని ఆడియెన్స్ అనుకునేవారు. కానీ వరుస విజయాల తర్వాత ఏమైందో ఏమో గానీ రాజ్​ తరుణ్ డీలాపడ్డారు. ‘కుమారి 21ఎఫ్’ తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.

కథల ఎంపికలో తప్పులతో పాటు ట్రెండ్​కు తగ్గట్లుగా సినిమాలు చేయకపోవడం రాజ్​ తరుణ్​కు మైనస్​గా మారిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే హిట్స్ రాకపోయినా ఆయన​ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిలో ఉన్న ఆయన ఇప్పుడో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఆ సినిమానే ‘తిరగబడరా సామీ’. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు కామెడీ, లవ్ స్టోరీస్​తో సినిమాలు చేస్తూ వచ్చిన రాజ్ తరుణ్..​ ఇప్పుడు యాక్షన్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ‘తిరగబడరా సామీ’కి డైరెక్షన్ వహిస్తున్న ఏఎస్ రవికుమార్ గతంలో పలు హిట్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది.

‘తిరగబడరా సామీ’ చిత్రంలో భయస్తుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తుండగా.. వయోలెన్స్ అంటే ఇష్టపడే పాత్రలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా నటిస్తున్నారు. ‘తిరగబడరా సామీ’ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్​లో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రొమాంటిక్ సీన్లతో పాటు యాక్షన్ సీన్లు కూడా వర్కవుటై ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెట్టగలిగితే.. సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న రాజ్ తరుణ్​కు మరో హిట్ ఖాయమనే చెప్పాలి. ఈ టీజర్ చూసిన నెటిజన్స్ యంగ్ హీరో హిట్ కొట్టేలాగే ఉన్నాడని అంటున్నారు. మరి.. ‘తిరగబడరా సామీ’ టీజర్ మీరు చూశారా? ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: NTR చావుకు కారణమైన వాళ్లే ఆయన ఫొటోకు దండం పెడుతున్నారు: CM జగన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి