ఇండస్ట్రీ షేక్ అయ్యే కాంబినేషన్! ఆమిర్ తో లోకేష్ కనగరాజ్ మూవీ?

ఇండస్ట్రీ షేక్ అయ్యే కాంబినేషన్! ఆమిర్ తో లోకేష్ కనగరాజ్ మూవీ?

Aamir Khan-Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యే కాంబినేషన్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

Aamir Khan-Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యే కాంబినేషన్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

చిత్ర పరిశ్రమలో కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబో మళ్లీ రిపీట్ అవుతుంటే అభిమానుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో.. అదే రేంజ్ లో రేర్ కాంబోలకు కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ న్యూస్ షేక్ చేస్తోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందట. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఖైదీ, విక్రమ్, లియో మూవీలతో ఓ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యునివర్సిటీని ప్రకటించి.. ఇండియా మెుత్తాన్ని తనవైపు చూసుకునేలా చేశాడు. ఇక తాజాగా లోకేష్ గురించిన ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తో లోకేష్ ఓ సినిమా చేయబోతున్నాడట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటుగా ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తారని సమాచారం. ఈ న్యూస్ కాస్త వైరల్ కావడంతో.. సినీ లవర్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇది నిజంగా బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు ఆమిర్ ఖాన్. మరి అలాంటి హీరోతో లోకేష్ ఎలాంటి మూవీ చేస్తాడా? అన్న క్యూరియాసిటి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా తర్వాత ఈ రేర్ కాంబో పట్టాలెక్కుతుందో చూడాలి. ఆమిర్-లోకేష్ కాంబోలో సినిమా కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments