Krishna Kowshik
ఇప్పుడు ఇండస్ట్రీలో నయా ట్రెండ్ నడుస్తోంది. అదే పాన్ ఇండియన్ మూవీస్. చిన్న హీరోలు సైతం తమ మార్కెట్ ను పెంచుకునేందుకు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శక నిర్మాతలు ఈ పిక్చర్స్ తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ 30 ఏళ్ల క్రితమే ఓ స్టార్ హీరో ఓ భారీ ప్రయోగం చేసి.. చేతులు కాల్చుకున్నారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో నయా ట్రెండ్ నడుస్తోంది. అదే పాన్ ఇండియన్ మూవీస్. చిన్న హీరోలు సైతం తమ మార్కెట్ ను పెంచుకునేందుకు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శక నిర్మాతలు ఈ పిక్చర్స్ తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ 30 ఏళ్ల క్రితమే ఓ స్టార్ హీరో ఓ భారీ ప్రయోగం చేసి.. చేతులు కాల్చుకున్నారు.
Krishna Kowshik
హీరోకు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఉంటే చాలూ.. అన్ని పాన్ ఇండియా సినిమాలే. వారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా మూవీలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. మార్కెట్ పెంచుకునేందుకు కూడా ఈ సినిమాలను ప్రిఫర్ చేస్తున్నారు హీరోలు సైతం. ఈ ఏడాది మూడు పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో కాసుల వర్షం కురిపించాయి. షారూఖ్-అట్లీ జవాన్, సందీప్ రెడ్డి వంగా-రణబీర్ కపూర్ యానిమల్, ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ మూవీగా పేరు తెచ్చుకున్నాయి. బాలీవుడ్ హీరోలకు బీ టౌన్ మార్కెట్లో కాకుండా.. ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. అలాగే ఇటీవల విడుదలైన సలార్ మూవీ సౌత్‌లోనే కాకుండా కూడా హిందీ ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అయితే పాన్ ఇండియా అనే పదం పరిచయమవ్వక ముందే.. భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించిన స్టార్ హీరో కం దర్శకుడు.. చేతులు కాల్చుకున్నాడు. దాదాపు 30 ఏళ్ల క్రితమే ఓ భారీ ప్రాజెక్టు మూవీ తెరకెక్కి, బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. ఆ మూవీలో సాదా సీదా నటులు కాదూ యాక్ట్ చేసింది. రజనీకాంత్, నాగార్జున వంటి దిగ్గజ నటులున్నారు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఊహించని విధంగా అతిపెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. ఇంతకు ఆ మూవీ ఏంటీ అనుకుంటున్నారా.. అదే శాంతి- క్రాంతి. 1988లో నటుడు-నిర్మాత, దర్శకుడు రవిచంద్రన్ ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 100వ జయంతి సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ప్రముఖ కన్నడ స్టార్ రవిచంద్రన్ నటించగా.. బాలీవుడ్ బ్యూటీ జుహీ చావ్లా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని నిర్మాత మూడు వెర్షన్లలో తెరకెక్కించాలని అనుకున్నాడు. హిందీ, తమిళంలో రజనీకాంత్, తెలుగు వెర్షన్‌లో నాగార్జునను పెట్టి సినిమా తీశారు. మొత్తం ఈ వర్షన్లన్నింటికి రూ. 10 కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత కమ్ హీరో రవిచంద్రన్. ఇది అప్పట్లో అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న చిత్రం. నాలుగు భాషల్లో, ముగ్గురు హీరోలతో, బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో సినిమా మొదలు పెడితే.. పూర్తయ్యే సరికి రెండేళ్లు పట్టింది. ఈ మూవీ విడుదలయ్యే సరికి, మొత్తం ఖర్చులు బడ్జెట్ కన్నా రెట్టింపు అయ్యాయి. పోనీ ఎట్టకేలకు సినిమా పూర్తయ్యింది.
సెప్టెంబర్ 1991లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేశారు. ఈ మూవీని చూసి విమర్శకులు.. ఇదేం మూవీ అంటూ ఎగతాళి చేశారు. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కాగా.. ఒక్కటంటే ఒక్క భాషలో కూడా ఈ మూవీ హిట్ కాలేదు. ఎక్కడ చూసినా నెగిటివ్ టాకే. రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోలు చేసినా.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైంది. కాస్తో, కూస్తో కర్ణాటక, తమిళనాడులో పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చినప్పటికీ.. లాభాలు రాలేదు ఈ మూవీ. రూ. 10 కోట్లు పెడితే.. కేవలం రూ. 8 కోట్లు వసూలు చేసింది అన్ని భాషల్లో కలిపి. ఈ సినిమాతో దర్శకుడు, నటుడు రవిచంద్రన్ అప్పులు పాలయ్యారు. ఆ మూవీతో అతడు కూడా దివాళా తీశాడు. కానీ తిరిగి కోలుకుని.. ఆ తర్వాత తన నిర్మాణ సంస్థ ఈశ్వరి ప్రొడక్షన్‌ను సక్సెస్ బాట పట్టించాడు. లేకుంటే మరో గొప్ప యాక్టర్ కమ్ దర్శకుడు ఏమైపోయేవాడో. మరీ ఓ స్టార్ హీరో పరిస్థితి ఇలా ఉంటే.. నిర్మాతల సంగతి ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.