Swetha
ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భారీ హిట్స్ ను అందుకున్నవి కొన్నైతే .. పోటీపడి మరీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవి మరికొన్ని. ఆ సినిమాల విషయానికొస్తే..
ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భారీ హిట్స్ ను అందుకున్నవి కొన్నైతే .. పోటీపడి మరీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవి మరికొన్ని. ఆ సినిమాల విషయానికొస్తే..
Swetha
ప్రతి ఏడాది వందల సంఖ్యలో చిత్రాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని చిత్రాలు సక్సెస్ బాటన పడతాయి. మరికొన్ని ప్లాప్ అవుతుంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయిన చిత్రాలకంటే ప్లాప్ అయిన చిత్రాలే ఎక్కువ. దిల్ రాజు చెప్పినట్టు కేవలం ఐదు లేదా ఆరు పర్సెంట్ సక్సెస్ రేట్ తో మాత్రమే తెలుగు ఇండస్ట్రీ నడుస్తోంది. కాగా, 2023 వ సంవత్సరానికి గాను మొత్తం విడుదలైన సినిమాల సంఖ్య 63. వీటిలో ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్ లలో విడుదలై.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు భారీ అంచనాల మధ్యన విడుదలై కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేని చిత్రాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్లాప్ అయిన వాటిలో మెగా హీరోల చిత్రాలే ఎక్కువగా ఉండడం ఆశ్చర్యం. ఈ ఏడాది విడుదలైన డిసాస్టర్ చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ సంవత్సరం భారీ బడ్జెట్ తో తెరకెక్కినా కూడా బాక్స్ ఆఫీస్ ముందు ప్లాప్ సినిమా ఏది అంటే.. ముందుగా వినిపించే పేరు ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో రూపొందించడమే కాకుండా.. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. కానీ, కనీసం ప్రభాస్ అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. పైగా, రామాయణం థీమ్ తో రూపొందించిన ‘ఆది పురుష్’ విడుదలైన తరువాత పలు వివాదాల్లో కూడా చిక్కుకుంది. దీనితో ప్రభాస్ అభిమానులు ఈ చిత్రంతో చాలా నిరాశ చెందారని చెప్పి తీరాలి. ఇక ఆ తర్వాత డిసాస్టర్ స్థానం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ కే దక్కుతుందని చెప్పి తీరాలి. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మెగాస్టార్ నటించిన చిత్రం అంటే సహజంగానే భారీ ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. కానీ భోళా శంకర్ చిత్రం విడుదలైన మొదటి రోజునే బోల్తా కొట్టింది. చెప్పాలంటే ఈ చిత్రం చిరుకు పెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇంకా డిసాస్టర్ లిస్ట్ లో అక్కినేని వారి వారసుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం కూడా యాడ్ అయింది. ఈ చిత్రం ఆడియన్సును ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా ప్రొడ్యూసర్ తో పాటు మిగిలిన వారు కూడా ఈ చిత్రం కారణంగా భారీ నష్టాలను చవి చూశారు. ఇక సమంత లీడ్ రోల్ లో నటించిన శకుంతల సినిమా గురించి అయితే.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు దీని గురించి టాక్ కూడా నడవలేదు. దీని వలన కూడా ప్రొడ్యూసర్ లు భారీగా నష్టపోయారని చెప్పి తీరాలి. ఇక మాస్ మహారాజ్ రవి తేజ విషయానికొస్తే ఈ హీరో నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు చిత్రాలు కూడా అతి పెద్ద డిసాస్టర్ అనిపించుకున్నాయి.
ఈ క్రమంలో మెగా హీరోల చిత్రాలైతే పోటీ పడి మరీ ప్లాప్ ల బాట పట్టాయి. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో, వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ, చిరు.. భోళా శంకర్, వరుణ్ తేజ్.. గాండీవ ధారి అర్జున చిత్రాలు సినీ అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలైన చిత్రాలలో.. హిట్ అయిన చిత్రాల సంఖ్య వేళ్ళ పైన లెక్కపెట్టుకోవచ్చు. ఓ రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సంవత్సరం హిట్స్ కంటే ప్లాప్ చిత్రాలనే ఎక్కువ చూసిందని చెప్పి తీరాలి. మరి, ఈ డిసాస్టర్ చిత్రాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.