Venkateswarlu
ఈ ఏడాది మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగనున్నాయి. ఈ ఏడాదిలాగే గత ఐదేళ్లలో పలువురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వారిలో ఎవరు గెలిచారు?
ఈ ఏడాది మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగనున్నాయి. ఈ ఏడాదిలాగే గత ఐదేళ్లలో పలువురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వారిలో ఎవరు గెలిచారు?
Venkateswarlu
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్‌లో గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ ప్యాన్ ఇండియా చిత్రం హనుమాన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ బాబు జనవరి 12వ తేదీన ‘గుంటూరు కారం’తో.. అదే రోజున తేజ సజ్జ ‘ హనుమాన్’తో.. మరుసటి రోజు.. అంటే జనవరి 13వ తేదీన విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ మూవీతో.. జనవరి 14వ తేదీన కింగ్ నాగార్జున ‘ నాసామిరంగ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సంక్రాంతి పందెం కోళ్లలో గెలుపు ఎవరు సాధిస్తారనేది తెలియాలంటే ఇంకో నాలుగైదు రోజులు వేచి చూడాల్సిందే. ఈ ఏడాది సంగతి పక్కన పెడితే.. గత ఐదేళ్లలో ఏఏ సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి? ఏ సినిమా పై చేయి సాధించింది ?
2019 సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా దాదాపు నలుగురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. ముందుగా థియేటర్లలోకి వచ్చింది బాలకృష్ణ. తండ్రి బయోపిక్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన విడుదల అయింది. అయితే, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆ మరుసటి రోజు రజినీకాంత్ నటించిన పేట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 10న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అయింది. ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, 11వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదల అయినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. జనవి 12వ తేదీ వెంకీ మామ ఎఫ్2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ ఏడాది సంక్రాంతి రేసులో పాల్గొన్న ఇద్దరు హీరోలు కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బరిలోకి దిగారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ అల వైకుంఠపురంలో..’ జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. రజినీకాంత్ – మహేష్ కంటే ఓ రోజు ముందు అంటే.. జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈ సంవత్సరం రవితేజ, రామ్‌పోతినేని, బెల్లకొండ శీనివాస్, విజయ్‌లు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ మహారాజా రవితేజ జనవరి 9వ తేదీన క్రాక్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక, జనవరి 14న రామ్‌పోతినేని ‘రెడ్’ సినిమాతో.. బెల్లకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జనవరి 13వ తేదీన మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ ఆవరేజ్ టాక్ తెచ్చుకుంది.
తండ్రీ,కొడుకులు నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కల్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి ’ మూవీ కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మరుసటి రోజు జనవరి 15వ తేదీన అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన ‘ హీరో’ సినిమా విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ ఏడాది పోటీ రసవత్తరంగా ఉండింది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు సంక్రాంతి బరిలోకి దిగారు. నందమూరి నటసింహం బాలయ్య బాబు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల అయింది. అయితే, ఆశించిన స్థాయిలో సినిమాకు స్పందన రాలేదు. మరుసటి రోజు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాల మధ్యలో ఇళయ దళపతి విజయ్ నటించిన ‘ వారసుడు’ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
మొత్తానికి ఒక్కో ఏడాది ఒక్కో హీరో సంక్రాంతి విజేతగా నిలుస్తూ వస్తూ ఉన్నాడు. 2020లో మాత్రం బరిలోకి దిగిన ఇద్దరు హీరోలు కూడా విజేతలుగా నిలిచారు. గత సంవత్సరం మాత్రం చిరంజీవి తన సత్తా చాటారు. కలెక్షన్ల వర్షం కురిపించారు. మరి, ఈ ఐదేళ్ల సంక్రాంతి విజేతలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.