iDreamPost
android-app
ios-app

బట్టలు ఆరబెట్టేందుకు చోటు లేదా? ఇది ట్రై చేయండి.. స్పేస్ వేస్ట్ అవ్వదు

  • Published Jul 20, 2024 | 9:04 PM Updated Updated Jul 20, 2024 | 9:04 PM

Best Useful Gadget For Every Housewife In Rainy Season: ఇది వర్షాకాలంలో బాగా ఉపయోగపడే వస్తువు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే బట్టలు ఆరబెట్టేందుకు ఇబ్బందులు తప్పుతాయి. వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టేందుకు చోటు లేక ఇబ్బందులు పడే ప్రతి ఇల్లాలికి ఈ వస్తువు ఉపయోగపడుతుంది.

Best Useful Gadget For Every Housewife In Rainy Season: ఇది వర్షాకాలంలో బాగా ఉపయోగపడే వస్తువు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే బట్టలు ఆరబెట్టేందుకు ఇబ్బందులు తప్పుతాయి. వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టేందుకు చోటు లేక ఇబ్బందులు పడే ప్రతి ఇల్లాలికి ఈ వస్తువు ఉపయోగపడుతుంది.

బట్టలు ఆరబెట్టేందుకు చోటు లేదా? ఇది ట్రై చేయండి.. స్పేస్ వేస్ట్ అవ్వదు

అపార్ట్మెంట్ లో ఉండేవారికి.. అద్దె ఇళ్లలో ఉండేవారికి బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఆ బాల్కనీ చూడ్డానికి ఎంతో ఉండదు. ఎక్కువ బట్టలు ఆరబెట్టలేం. పైగా వాన జల్లులు పడుతుంటాయి. దీనితో ఉతికిన బట్టలు ఉతికినట్టే ఉంటాయి. పోనీ మేడ మీద ఆరేద్దామంటే పోటీ ఎక్కువ. ఇక చేసేదేమీ లేక మంచాల మీద, సోఫాల మీద, కుర్చీల మీద వేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెడుతూ ఉంటారు. ఎవరైనా వస్తే కింద కూర్చోబెడతారో ఏంటో మరి. ఇంట్లో దండెం కడదామంటే అటూ ఇటూ తిరిగినప్పుడు అడ్డు వస్తుంది. బట్టలు ఆరేయాల్సిన ప్రతిసారీ కట్టుకోవాలి. అవసరం లేకపోతే తీసేయాలి. ఇంత గ్రామ పంచాయితీ లేకుండా.. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఒకటే మార్గం. 

విరావ్ రిట్రాక్టబుల్ క్లాత్స్ లైన్ వాల్ మౌంటెడ్:

విరావ్ రిట్రాక్టబుల్ క్లాత్స్ లైన్ వాల్ మౌంటెడ్ ఏబీఎస్ కేస్, అల్యూమినియం డ్రైయర్ గాడ్జెట్ ఒకటి ఉంది. ఇది ఒక బాక్స్ లా ఉంటుంది. దీన్ని సింపుల్ గా గోడకు ఒక పక్కకు అతికించి పెట్టుకుంటే చాలు. వ్యతిరేక దిశలో ఒక చిన్న క్లాంప్ ని సెట్ చేయాలి. గోడకు పెట్టిన బాక్స్ లోంచి బట్టల తీగ బయటకు వస్తుంది. దాన్ని వ్యతిరేక దిశలో ఉన్న క్లాంప్ కి తగిలిస్తే చాలు. మీ బట్టలని ఆరబెట్టుకోవచ్చు. ఆరిన తర్వాత ఆ తీగను క్లాంప్ నుంచి తీసేస్తే దానికదే ఆ తీగ ఆ మెయిన్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న తీగ స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసింది. కాబట్టి తెగిపోతుందన్న టెన్షన్ అక్కర్లేదు. దీన్ని గోడకు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ప్రత్యేకించి స్థలం అక్కర్లేదు. చాలా తేలికగా ఉంటుంది. దీన్ని అతికించుకుంటే సరిపోద్ది. గోడకు మేకులు కొట్టాల్సిన పని లేదు. లేడీస్ కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 3,990 కాగా ఆఫర్ లో రూ. 1995కే అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3Wv7eQ2)

పరాట్పర్ మాల్ క్లాత్ డ్రైయింగ్ స్టాండ్: 

పరాట్పర్ మాల్ క్లాత్ డ్రైయింగ్ స్టాండ్ ఒకటి ఉంది. దీన్ని బాల్కనీలో సెట్ చేసుకోవచ్చు. దీనికి 4 తీగలు ఉంటాయి. పైన చెప్పిన గాడ్జెట్ లానే ఇది కూడా ఉంటుంది. తీగలు అవసరం లేనప్పుడు బాక్స్ లోకి పంపించేయవచ్చు. దీని అసలు ధర రూ. 1999 కాగా ఆఫర్ లో రూ. 799కే అందుబాటులో ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4cObEr2)

కేకేడీ స్టెయిన్ లెస్ స్టీల్ క్లాత్స్ లైన్:

ఇది కూడా వాల్ మౌంటెడ్ గానే వస్తుంది. దీని లోంచి ఒక తీగ బయటకు వస్తుంది. దాన్ని లాక్ చేసి బట్టలు ఆరబెట్టుకోవచ్చు. అయిపోయాక మళ్ళీ ఆ తీగను లోపలకు పంపించేయవచ్చు. దీని వల్ల కూడా స్పేస్ కవర్ అవుతుంది. దీని అసలు ధర రూ. 1095 కాగా ఆఫర్ లో రూ. 424కే పొందవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3Lwhb9z)