iDreamPost
android-app
ios-app

పండగ పూట కూడా పాత మొగుడేనా? ఇది తప్పని మీకు తెలుసా? అసలు సామెత ఇదే!

  • Published Jul 16, 2024 | 8:15 AM Updated Updated Jul 16, 2024 | 8:15 AM

Still Some People Using This Wrong Proverb, Do You Know This Is Wrong: పండగ పూట కూడా పాత మొగుడేనా అనే సామెత వినే ఉంటారు. ఈ సామెత ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఈ సామెత కరెక్ట్ కాదని మీలో ఎంతమందికి తెలుసు? అసలు సామెత అది కాదు. వేరే.

Still Some People Using This Wrong Proverb, Do You Know This Is Wrong: పండగ పూట కూడా పాత మొగుడేనా అనే సామెత వినే ఉంటారు. ఈ సామెత ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఈ సామెత కరెక్ట్ కాదని మీలో ఎంతమందికి తెలుసు? అసలు సామెత అది కాదు. వేరే.

పండగ పూట కూడా పాత మొగుడేనా? ఇది తప్పని మీకు తెలుసా? అసలు సామెత ఇదే!

సామెత లేదా నానుడి ఏదైనా గానీ పూర్వం పెద్దలు ఈ చిన్న సామెతలోనే ఒక పెద్ద కథని దాచి పెట్టేవారు. పెద్ద కథ చెప్పడానికి బదులు చిన్న వాక్యంతో చెప్పేసేవారు. పైగా హాస్యం కలగలిసి ఉండడంతో బాగా ప్రజాదరణ పొందాయి. అలాంటి సామెతలు ఎన్నో ఉన్నాయి. వీటిలో జీవిత సత్యాలు, పరమార్థాలు, బతుకు తెరువు ఇలా ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి. మన తెలుగు భాష మాధుర్యం, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ కొట్టొచ్చి కనబడతాయి. తిట్టడానికైనా, గసురుకోవడానికైనా, మంచి మాట చెప్పడానికైనా సందర్భానికి తగ్గట్టు అనేక సామెతలు అందుబాటులో ఉన్నాయి. జనరేషన్స్ మారిపోవడం వల్ల ఇప్పుడు ఈ సామెతలను వాడడం లేదు. కానీ పల్లెటూర్లలో ఇంకా ఈ సామెతలను వాడేవారు ఉన్నారు.

అంగిట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు.. అందని ద్రాక్ష పుల్లన, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఇలా చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ‘పండగ పూట కూడా పాత మొగుడేనా’ అనే సామెత ఒకటి. అయితే ఈ సామెత పూర్తిగా తప్పు. ఇది చాలా మందికి తెలియదు. తెలియక చాలా మంది ఇప్పటికీ వాడేస్తున్నారు. పండగ పూట కూడా పాత మొగుడేనా ఏంటి? అంటే ప్రతీ పండుగకు ఇంట్లో ఆడవాళ్లు.. పాత భర్తను మార్చి కొత్త భర్తను తెచ్చుకోవాలనా? మరి ఈ మొగుడు అన్న పదం ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందో తెలియదు కానీ అసలు సామెత అయితే ఇది కాదు. అసలు సామెత.. పండగ పూట కూడా పాత మడుగేనా. మడుగు అంటే వస్త్రం.

వస్త్రం అంటే బట్టలు. మనకి తెలుసు.. పండగ అంటే ఖచ్చితంగా కొత్త బట్టలు కట్టుకోవడం అని. డబ్బున్నా, లేకున్నా పండగ వచ్చిందంటే ఆ ఇంట్లో అందరికీ కొత్త బట్టలు ఉండాలి. ఇది అనాదిగా ఆచరిస్తున్న నియమం. పండగ వచ్చిందంటే చిన్న పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు కట్టుకుంటారు. అయితే అప్పట్లో డబ్బులు లేక కొనుక్కునేవారు కాదు. దీంతో పెద్దలు పండగ పూట కూడా పాత మడుగేనా? అనే నానుడిని వాడేవారు. పండగ పూట కూడా పాత బట్టలేమిటి? కొత్తవి కట్టుకో అని చెప్పడం కోసం ఈ సామెత వాడేవారు. అలా ఈ సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.

అయితే ఇంకో సామెత కూడా ఉంది. పండగ పూట కూడా పాత మొగుడా. పాత అంటే చినిగిన బట్టలు అని కూడా అర్థం వస్తుందని పెద్దలు చెబుతారు. పండగ పూట కూడా   చినిగిన బట్టలేంటి మొగుడా అని భార్యలు అనేవారు. అలా ‘పండగ పూట కూడా పాత.. మొగుడా’ అన్న సామెత ‘పండగ పూట కూడా పాత మొగుడేనా’గా మారిపోయింది. ఈ సామెత అయితే తప్పు. అసలు సామెత పండగ పూట కూడా పాత మడుగేనా గానీ పండగ పూట కూడా పాత… మొగుడా గానీ. ఇప్పుడు చెప్పండి.. పండగ పూట కూడా పాత మొగుడేనా? ఈ సామెత తప్పా కాదా? ఇంత విలువైన ఈ సామెతను ఊరికే చదివేసి వదిలేస్తే ఎలా? ఊర్లలో ఉండే అమ్మమ్మ, నాన్నమ్మలకు తెలిసేలా షేర్ చేయండి మరి.