iDreamPost
android-app
ios-app

సన్‌రూఫ్ కారులో వెళ్తున్నప్పుడు బయటకు రావడం నేరం.. మరెందుకిచ్చినట్టు?

  • Published Jul 17, 2024 | 9:57 PM Updated Updated Jul 17, 2024 | 9:57 PM

Sticking Your Head Out Of A Moving Car's Sunroof Is Illegal But Why Companies Giving This Feature: సన్ రూఫ్ కారు కొంతమంది కావాలని పట్టుబట్టి మరీ కొనుక్కుంటారు. కొంతమంది లేకపోయినా ప్రత్యేకించి చేయించుకుంటారు. కారులో వెళ్తూ సన్ రూఫ్ లోంచి బయటకు రావడం అంటే సరదా. అయితే అలా రావడం చట్టరీత్యా నేరం అని తెలుసా? మరి నేరం అయినప్పుడు కారు కంపెనీలు ఎందుకు సన్ రూఫ్ ఫీచర్ ని ఇచ్చినట్టు?

Sticking Your Head Out Of A Moving Car's Sunroof Is Illegal But Why Companies Giving This Feature: సన్ రూఫ్ కారు కొంతమంది కావాలని పట్టుబట్టి మరీ కొనుక్కుంటారు. కొంతమంది లేకపోయినా ప్రత్యేకించి చేయించుకుంటారు. కారులో వెళ్తూ సన్ రూఫ్ లోంచి బయటకు రావడం అంటే సరదా. అయితే అలా రావడం చట్టరీత్యా నేరం అని తెలుసా? మరి నేరం అయినప్పుడు కారు కంపెనీలు ఎందుకు సన్ రూఫ్ ఫీచర్ ని ఇచ్చినట్టు?

సన్‌రూఫ్ కారులో వెళ్తున్నప్పుడు బయటకు రావడం నేరం.. మరెందుకిచ్చినట్టు?

సన్ రూఫ్ కారులో వెళ్తున్నప్పుడు తల బయట పెట్టడం సరదా. పెద్దలు, పిల్లలు అలా సరదాగా బయటకు వచ్చినప్పుడు సన్ రూఫ్ కారులోంచి ఛాతి భాగం వరకూ పైకి వస్తారు. ఇదో ఫ్యాషన్ ఇప్పుడు. సినిమాల్లో కూడా కారు వేగంగా వెళ్తుంటే సన్ రూఫ్ తీసి పైకి వస్తారు. ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అయితే ఇలా చేయడం నేరం అని చాలా మందికి తెలియదు. మరి కార్ల తయారు చేసే కంపెనీలు ఈ సన్ రూఫ్ ని ఎందుకిచ్చినట్టు? పని లేక ఇచ్చారా? నేరం అని తెలిసి ఎందుకిచ్చారు అని అంటే?

కొంతమంది రీల్స్ కోసం, ఫోటోల కోసం కారు బానెట్ మీద కూర్చుని ప్రయాణం చేయడం, కారు టాప్ మీద కూర్చుని ట్రావెల్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే అలా ట్రావెల్ చేయడం నేరం. కారు బానెట్ మీద అనే కాదు.. సన్ రూఫ్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా బయటకు రాకూడదు. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా గానీ ఆ రూఫ్ లోంచి బయటకు రాకూడదు. అలా వస్తే నేరం. పైగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. కదులుతున్న కారు లోంచి సన్ రూఫ్ తీసి బయటకు తల పెట్టడం చట్ట విరుద్ధం. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 177 కింద నేరం. సన్ రూఫ్ లోంచి తల బయటపెట్టి ట్రావెల్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే కనుక వంద రూపాయల వరకూ జరిమానా విధించబడుతుంది. రెండు, మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే కనుక 300 రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. దీనికి డ్రైవర్ అలానే కారు యజమాని ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలానే 184 సెక్షన్ కింద అలా తల బయటపెట్టి ట్రావెల్ చేయడం పబ్లిక్ కి డేంజర్ కాబట్టి శిక్షార్హులు.  

మరి ఇన్ని లిటిగేషన్స్ ఉన్నప్పుడు కారుకి సన్ రూఫ్ ఎందుకిచ్చినట్టు? అని మీకు సందేహం వస్తుంది కదూ. ఆ సన్ రూఫ్ ఇచ్చింది వెంటిలేషన్ పర్పస్. అలానే కస్టమర్స్ ని ఆకర్షించడానికి కంపెనీలు వాడే స్ట్రాటజీ. అయితే కారు ఆగి ఉన్నప్పుడు సన్ రూఫ్ తీసి బయటకు తల పెట్టడం నేరం కాదు. కారు రన్నింగ్ లో ఉండగా తల, శరీరం బయట పెట్టకూడదు. ఎందుకంటే సడన్ బ్రేక్ వేస్తే సన్ రూఫ్ బయట తల పెట్టిన వారికి గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే రన్నింగ్ లో ఉండగా అలా తల బయటపెట్టడం నేరం అని మోటార్ వెహికల్ చట్టం చెబుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు సరదా పడినా గానీ మందలించాలి. ఫైన్ తక్కువే పడుతుందని లైట్ తీసుకోకుండా మీ పిల్లలు, మీ వాళ్ళు ఫైన్ గా ఉండాలి అనే దాని గురించి ఆలోచించండి. ఈ విషయాన్ని షేర్ చేయండి.