nagidream
బల్లులు గోడల మీద ఈజీగా పాకేస్తాయి. సీలింగ్ మీద తలకిందులుగా వేలాడతాయి. కానీ అవి కిందకు పడిపోకుండా ఎలా ఉంటున్నాయి? దీని వెనుక కారణం ఏంటి? అసలు అవి ఇంట్లోకి రావడానికి కారణం ఏంటి? ఇంట్లోంచి తరిమికొట్టాలంటే ఏం చేయాలి?
బల్లులు గోడల మీద ఈజీగా పాకేస్తాయి. సీలింగ్ మీద తలకిందులుగా వేలాడతాయి. కానీ అవి కిందకు పడిపోకుండా ఎలా ఉంటున్నాయి? దీని వెనుక కారణం ఏంటి? అసలు అవి ఇంట్లోకి రావడానికి కారణం ఏంటి? ఇంట్లోంచి తరిమికొట్టాలంటే ఏం చేయాలి?
nagidream
బల్లులు అంటే చాలా మంది అసహ్యించుకుంటారు. బల్లి ఒంటి మీద పడితే కంపరంగా ఫీలవుతారు. అయితే బల్లి పలానా చోట పడితే అరిష్టం అని.. పలానా చోట పడితే మంచిదని నమ్ముతుంటారు. ఈ విషయాలు పక్కన పెడితే బల్లి అవలీలగా గోడల మీద పాకేస్తుంటాయి. గోడల మీదనే కాకుండా సీలింగ్ మీద కూడా పాకేస్తుంటాయి. ఒక్కోసారి గ్రిప్ దొరక్క కింద పడిపోతుంటాయి. అయితే అసలు బల్లులకు గ్రిప్ ఎలా దొరుకుతుంది? అవి ఎలా రివర్స్ లో కింద పడిపోకుండా ఉండగలుగుతున్నాయి అని అంటే బల్లులు వాటి పాదాల కింద సక్షన్ ప్యాడ్స్ ని కలిగి ఉంటాయి. ఈ సక్షన్ ప్యాడ్స్ వల్ల అవి గోడల మీద, సీలింగ్ ల మీద ఎక్కువ సేపు ఉండగలుగుతాయి.
అయితే బల్లి గోడకు గానీ సీలింగ్ కి గానీ వ్యతిరేకంగా సక్షన్ ప్యాడ్ ని ప్రెస్ చేసినప్పుడు.. సక్షన్ ప్యాడ్ కి, గోడ లేదా సీలింగ్ కి మధ్య గాలి అనేది బయటకు పోతుంది. దాని వల్ల ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది. ఇది సక్షన్ ప్యాడ్, గోడ మధ్య ఒత్తిడిని తగ్గిస్తుంది. వాతావరణ పీడనం గోడకు వ్యతిరేకంగా ప్యాడ్ ను నొక్కడానికి అలానే బల్లిని అక్కడ నుంచి పడిపోకుండా ఉండేలా చేస్తుంది. ఇదే విధంగా తొండలు కూడా అంతే. తొండలకు కూడా వాటి పాదాల కింద సక్షన్ ప్యాడ్స్ ఉంటాయి. అయితే ఈ బల్లులు ఇంట్లోకి రావడానికి కారణం.. వాటికి రుచికరమైన దోమలు, ఈగలు, బొద్దింకలు వంటి పురుగులు ఉండడం వల్లే. అలానే వీటికి ఆహారం, నీరు కోసం మనుషుల ఇళ్ళకి ఆకర్షితులవుతాయి. వీటిలో ఎక్కువగా మాంసం తినే బల్లులు ఉంటాయి. అందుకే మనుషుల ఆహారం వాటికి బాగా రుచికరంగా ఉంటాయట.
ఈ బల్లులు రాకుండా ఉండాలంటే మిగిలిపోయిన ఫుడ్ ని లేదా పైకి కనిపించేలా ఉన్న ఫుడ్ ని అక్కడ నుంచి తీసేయాలి. బల్లుల కంటికి కనిపించకుండా ఉంచాలి. మరి ఈ బల్లులు మనం నిద్రపోయాక మన దగ్గరకు వస్తాయా అంటే.. రావు. మన దగ్గరకు రావడానికి భయపడతాయట. మనుషులు, మాంసం తినే జీవుల వల్ల హాని కలుగుతుందని ఫీల్ అవుతాయట. అయితే ఈ బల్లులు గోడ మీద, సీలింగ్ ల మీదనే కాదు నేల మీద కూడా పాకుతాయి. అంతేకాదు.. బెడ్ మీద ఎవరూ లేకపోతే దోమలను, పురుగులను వేటాడడం కోసం అవి బెడ్ మీదకు కూడా వస్తాయి. అయితే ఇవి విషపూరితం కావని.. ఏమీ కావని అంటున్నారు. చల్లని నీటిని వాటి మీద స్ప్రే చేస్తే అవి త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోతాయట. వాటర్ బాటిల్ లో ఐస్ ముక్కలు, నీళ్లు వేసి ఓవర్ కూలింగ్ వాటర్ ని బల్లుల మీద చల్లితే ఆ ప్రాంగణం నుంచే వెళ్ళిపోతాయట. అది మరి విషయం. మరి మీకు బల్లిని చూస్తే ఏం చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి.