iDreamPost
android-app
ios-app

కూతురా? కోడలా? ఈ ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి?

కూతురు, కోడలు.. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనే పోటీ అనేది ఉంటుంది. కూతురు ఉన్న ప్రతీ తల్లికి ఇదొక సవాలు లాంటిది. కూతురికి ప్రాధాన్యత ఇస్తే కోడలు ఫీలింగ్.. కోడలికి ప్రాధాన్యత ఇస్తే కూతురు ఫీలింగ్.. మధ్యలో నలిగిపోయే అమ్మ ఫీలింగే ఎవరికీ అర్థం కాదు. అసలు అత్తగారు కోడలికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా? లేక కూతురికి ఇవ్వాలా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది?

కూతురు, కోడలు.. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనే పోటీ అనేది ఉంటుంది. కూతురు ఉన్న ప్రతీ తల్లికి ఇదొక సవాలు లాంటిది. కూతురికి ప్రాధాన్యత ఇస్తే కోడలు ఫీలింగ్.. కోడలికి ప్రాధాన్యత ఇస్తే కూతురు ఫీలింగ్.. మధ్యలో నలిగిపోయే అమ్మ ఫీలింగే ఎవరికీ అర్థం కాదు. అసలు అత్తగారు కోడలికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా? లేక కూతురికి ఇవ్వాలా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది?

కూతురా? కోడలా? ఈ ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి?

చాలా మంది తల్లులకు కన్న కూతురి మీద ప్రేమ ఎక్కువే ఉంటుంది. అందుకని కోడలి కంటే కూడా కూతురికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన శాస్త్రం చెప్తుంది ఏంటంటే.. కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలి అని. కోడలు అంటే ఇంట్లో దీపం వెలిగించే లక్ష్మీ దేవి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. కాబట్టి కోడలికి ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. కూతురు కూడా దీపం వెలిగిస్తుంది. కానీ ఆమె పుట్టినింటిలో ఉండదుగా. ఎప్పటికైనా మెట్టినింటికి వెళ్లాల్సిన అమ్మాయే కాబట్టి కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. ఇక కోడలికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలని అంటే కనుక.. దానికి మరో ప్రత్యేక కారణం ఉంది.

పుట్టింట్లో యువరాణిగా.. మెట్టింట్లో సేవకురాలిగా:

తన ఇంటి పేరుని మార్చుకుని మరీ మెట్టినింట్లో అడుగుపెడుతుంది కోడలు. మెట్టినింటి వారి ఇంటి పేరునే కాకుండా, ఇంట్లో అందరి పేర్లను నిలబెట్టేందుకు కృషి చేస్తుంది. పుట్టింట్లో యువరాణిలా బతికిన ఆమె.. కోడలిగా వచ్చి మెట్టినింట్లో సేవకురాలిగా పని చేస్తుంది. పనిమనిషిలా, మన మనిషిలా నడుచుకుంటుంది. మెట్టినింటి వారి కోసం తన ప్రపంచాన్నే వదులుకుని వచ్చిన త్యాగశీలి కోడలు. కన్న తల్లిదండ్రులు ఎంతటి ఉన్నత కుటుంబానికి చెందిన వారైనా గానీ మెట్టింటి వారి పట్ల ఉన్నతమైన భావాలను కలిగి ఉండే గొప్ప గుణం కలిగి ఉంటుంది కోడలు. మెట్టినింటి గౌరవాన్ని కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకున్న గుణవంతురాలు కోడలు.

భర్త పెట్టే పచ్చడి మెతుకులనే పంచభక్ష్య పరమాన్నాలుగా:

అమ్మాయి తండ్రి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టే స్థోమత ఉన్నా కూడా.. భర్త పెట్టే పచ్చడి మెతుకులనే పంచభక్ష్య పరమాన్నాలుగా స్వీకరించే సహృదయరాలు కోడలు. కుడి కాలు పెట్టి కోడలు మెట్టింట్లో అడుగుపెట్టగానే తన తల్లే కోడలి రూపంలో వచ్చిందని మురిసిపోతాడు మావయ్య. ఎందుకంటే అందరికీ అన్నం వండి వడ్డించేది అమ్మే కదా. ఆ అమ్మే కోడలిగా తిరిగొచ్చిందని భావిస్తాడు.  కొడుకు పెళ్లికి వేసిన పందిరి ఆకుల మీద కూర్చున్న పితృ దేవతలకి నాంది శ్రాద్ధం పెట్టి, కుటుంబాన్ని ఉద్ధరించే సమర్ధురాలిని కోడలిగా ఎంచుకున్నానని ఆ మావయ్య గర్వపడతాడు. తన ఇంటికి కోడలు వచ్చిన క్షణం.. తన కుటుంబానికి ఒక వెలుగు వచ్చినట్లు భావిస్తాడు.

కూతురు కోడలు.. కోడలే కూతురు:

కట్టుకున్న భర్త కోసం, భర్తను కన్నవారి కోసం అన్నీ వదులుకుని మెట్టినింట్లో అడుగుపెడుతుంది కోడలు. కాబట్టి ఆమె పుట్టింట్లో వదులుకుని వచ్చిన వాటిని ఏదో ఒక రూపంలో మెట్టినింటి వారు ఇవ్వాలి. తల్లిదండ్రులను వదిలి వచ్చినందుకు అత్త, మామలే ఆమెకు అమ్మ, నాన్న అవ్వాలి. తన కల, లక్ష్యం, బంధాలు అన్నీ వదులుకుని వస్తుంది కాబట్టి కూతురు కంటే కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ధర్మం అని శాస్త్రం చెబుతుంది. కూతురికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆమె ఎలాగూ అత్తారింటికి వెళ్తుంది కాబట్టి.. కోడలిగా ఆమెకు గౌరవ, మర్యాదలు అక్కడ దక్కుతాయి. ప్రతీ కూతురికి తల్లి ప్రాధాన్యత ఇవ్వడం కంటే.. అత్తే తల్లి అయ్యి ప్రాధాన్యత, గౌరవ, మర్యాదలు ఇస్తే రెండు కుటుంబాలు బాగుంటాయని శాస్త్రం చెబుతుంది. 

కోడలికే ప్రాధాన్యత:

ఎవరో ఒకరి ఇంటికి కోడలిగా వెళ్లిన కూతురి కంటే.. మన ఇంటికి కోడలిగా వచ్చిన వేరొకరి కూతుర్ని కూతురిగా స్వీకరిస్తే.. మరొక ఇంట్లో అడుగుపెట్టిన సొంత కూతురు కోడలిగా కాకుండా కూతురిగా స్వీకరించబడుతుంది. లాజిక్ ప్రకారం చూసినా కూడా కూతురు ఎప్పటికైనా కోడలే అవుతుంది కాబట్టి.. కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కూతురు గొప్పా? కోడలు గొప్పా? అంటే కూతురు కోడలు అవ్వడం గొప్ప. ఎవరో ఏంటో తెలియని ఇంట్లో అడుగుపెట్టి.. సర్దుకుపోయి బతకడం గొప్ప. కోడలు అయినప్పటికీ కూతురిలా అత్త, మామలను కంటికి రెప్పలా చూసుకోవడం గొప్ప. అత్త, మామలకు తల్లి అవ్వడం గొప్ప. మరి ఈ విషయంలో మీరేమంటారు? మీరు మీ కోడలిని కూతురిలా చూసుకుంటున్నారా? మీరు కూతురికి ప్రాధాన్యత ఇస్తారా? కోడలికి ప్రాధాన్యత ఇస్తారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి