iDreamPost
android-app
ios-app

ఇదుంటే ఎండా, వాన, దుమ్ము నుంచి మీ బైక్ సేఫ్.. ధర కూడా తక్కువే!

  • Published Jul 22, 2024 | 9:45 PM Updated Updated Jul 22, 2024 | 9:45 PM

Bike, Scooty Blazers For Protections From Sunlight, Heavy Rain And Dust: ఎక్కడైనా బైక్ పార్క్ చేసినప్పుడు కాకి రెట్టలు వేస్తుంటాయి. లేదా వర్షం పడుతుంది. దుమ్ము చేరి సీటు, బండి పాడవుతుంది. ఇలాంటి సమస్యల కోసం బైక్ కవర్లు ఉన్నా గానీ అవి పోర్టబుల్ కాకపోవడం ఈ ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే గాడ్జెట్ ఒకటి ఉంది.

Bike, Scooty Blazers For Protections From Sunlight, Heavy Rain And Dust: ఎక్కడైనా బైక్ పార్క్ చేసినప్పుడు కాకి రెట్టలు వేస్తుంటాయి. లేదా వర్షం పడుతుంది. దుమ్ము చేరి సీటు, బండి పాడవుతుంది. ఇలాంటి సమస్యల కోసం బైక్ కవర్లు ఉన్నా గానీ అవి పోర్టబుల్ కాకపోవడం ఈ ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే గాడ్జెట్ ఒకటి ఉంది.

ఇదుంటే ఎండా, వాన, దుమ్ము నుంచి మీ బైక్ సేఫ్.. ధర కూడా తక్కువే!

కొన్నిసార్లు బైక్ ని ఎండలో ఉంచాల్సి వస్తుంది. పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల బయట పెట్టాల్సి వస్తుంది. చెట్టు నీడలో పెడితే ఏ కాకో రెట్ట వేసే ఛాన్స్ ఉంది. ఏ వర్షమో పడితే సీటుతో పాటు బండి మొత్తం తడిచిపోతుంది. ఇక దుమ్ము పడితే ఇక బండి నాశనమే. తుడుచుకోవడానికి చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఈ బైక్ బ్లేజర్. మనిషి సూట్ వేసుకున్నట్టు.. బట్టలు వేసుకున్నట్టే మీ బైక్ కి కూడా ఈ బ్లేజర్ ని తొడిగేస్తే ఎండా, వాన, దుమ్ము నుంచి రక్షించుకోవచ్చు. బైక్ బ్లేజర్ సెమీ ఆటోమేటిక్ ఫుల్ బాడీ బైక్ కవర్ ఇది. రెగ్యులర్ కవర్స్ తో పోలిస్తే ఇది చాలా బెటర్. ఎందుకంటే రెగ్యులర్ బైక్ కవర్స్ ని మనం ఎక్కడికీ తీసుకెళ్ళలేము. దాన్ని మడతపెట్టడం, క్యారీ చేయడం, మళ్ళీ ఎక్కడైనా బైక్ మీద కవర్ లా వేయడం పెద్ద తలనొప్పి యవ్వారం.

అదే ఈ బైక్ బ్లేజర్ అయితే ఇంత ప్రయాస పడాల్సిన పని లేదు. ఇది చిన్న టిఫిన్ బాక్స్ సైజులో ఉంటుంది. మేస్త్రీ పనులు చేసేవారి దగ్గర కొలత టేపు చూసే ఉంటారు. కొలవడం కోసం టేపుని ఒక చిన్న రౌండ్ వస్తువు లోంచి లాగుతారు. పని అయిపోయాక ఆ వస్తువుకి ఉన్న ఒక సపోర్ట్ తో టేపుని లోపలకు పంపిస్తారు. సరిగ్గా ఇలానే పని చేస్తుంది ఈ బైక్ బ్లేజర్. దీన్ని బైక్ కి పక్కన ఒకవైపు అమర్చుకోవచ్చు. చిన్నగా ఉండడం వల్ల అడ్డు ఉన్నట్టు ఉండదు. ఎక్కడికి వెళ్లినా గానీ ఆ చిన్న బైక్ బ్లేజర్ లోంచి బైక్ కవర్ వస్తుంది. దాన్ని లాగి మొత్తం బైక్ కి కవర్ లా పరచవచ్చు.

ఇది వాటర్ ప్రూఫ్, యూవీ ప్రొటెక్షన్, 100 పర్సెంట్ డస్ట్ ప్రూఫ్ తో వస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, వర్షం పడినా, దుమ్ము పడినా మీ బైక్ మాత్రం సురక్షితంగా ఉంటుంది. యాంటీ థెఫ్ట్, స్క్రాచ్ ప్రూవ్ కవర్స్ ఇవి. ఇది యమహా, హొండా, టీవీఎస్, బజాజ్, హార్లీ డేవిడ్సన్, హీరో, సుజుకీ ఇలా అన్ని రకాల బైక్స్ కి ఇది సూట్ అవుతుంది. ఇందులో స్కూటీలకు సెట్ అయ్యేవి కూడా ఉన్నాయి. ఇవి బ్లూ, రెడ్, బ్లాక్ ఇలా చాలా రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. మీ బైక్ లేదా స్కూటీ మోడల్ ఎంటర్ చేసి సరైనది కొనుక్కోవాల్సి ఉంటుంది. దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 1250 ఉండగా.. ఆఫర్ లో రూ. 899కే అందుబాటులో ఉంది.